ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అక్రమం
1 min read

ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు
మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి
మంత్రాలయం, న్యూస్ నేడు : ఎంపి మిథున్ రెడ్డి అరెస్ట్ అక్రమం అని కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి విమర్శించారు. మంత్రాలయం మండలం రాంపురం గ్రామంలోని ఎమ్మెల్యే స్వగృహంలో మీడియా తో మాట్లాడుతూ కక్ష సాధింపు లో భాగంగా ఎంపీ మిథున్ రెడ్డి ని అక్రమ అరెస్టు చేయడం సిగ్గు చేట్టని మండిపడ్డారు. ప్రజల్లో వైస్సార్సీపీ కి జగన్ మోహన్ రెడ్డికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే వైస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి , వేధింపులకు గురి చేస్తున్నారని. ఎన్ని అక్రమ కేసులు పెట్టిన ఎన్ని అక్రమ అరెస్టు లు చేసిన వైఎస్సార్సీపీ నాయకులు భయపడే ప్రసక్తే లేదని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైస్సార్సీపీ విజయం సాధించడమే కాకుండా జగన్ మోహన్ రెడ్డి రెండవ సారి ముఖ్యమంత్రి ఖావడం ఖాయమన్నారు.

