రాష్ట్రస్థాయి ఈత పోటీల్లో జిల్లా క్రీడాకారుల ప్రతిభ
1 min read

ఆరు సిల్వర్, మూడు బ్రాంజ్ మొత్తం తొమ్మిది మెడల్స్ కైవసం
కర్నూలు, న్యూస్ నేడు: విశాఖపట్నం జీవీఎంసీ ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో 19, 20 తేదీల్లో రెండు రోజుల పాటు నిర్వహించిన 10వ ఏపీ సబ్ జూనియర్, జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ అక్వాటిక్ ఛాంపియన్షిప్ – 2025లో జిల్లా ఈత క్రీడాకారులు ప్రతిభ కనబరిచి మెడల్స్ సాధించారు. గ్రూప్ 1 బాలుర విభాగంలో వై. దేవసృత్ సాయి 200, 100 మీటర్స్ ఫ్రీ స్టైల్ లో ద్వితీయ స్థానం, 50 మీటర్స్ బ్యాక్ స్ట్రోక్ లో ద్వితీయ స్థానంలో నిలిచి మూడు సిల్వర్ మెడల్స్, బాలికల విభాగంలో హేమలత 200, 100 మీటర్స్ బ్యాక్ స్ట్రోక్ లో ద్వితీయ స్థానం, 100 బ్రెస్ట్ స్ట్రోక్ లో ద్వితీయ స్థానంతో మూడు సిల్వర్ మెడల్స్, 50 మీటర్స్ బ్యాక్ స్ట్రోక్ లో తృతీయ స్థానంలో నిలిచి బ్రాంజ్ మెడల్, గ్రూప్-2 బాలికల విభాగంలో కురువ శృతి 200 మీటర్స్ బ్యాక్ స్ట్రోక్, 800 మీటర్స్ ఫ్రీ స్టైల్ ఈవెంట్స్ లో తృతీయ స్థానంలో నిలిచి రెండు బ్రాంజ్ మెడల్స్ సాధించారు. ప్రతిభ కనభరిచిన క్రీడాకారులను డీ ఎస్ డీ వో భూపతి రావు, స్విమ్మింగ్ కోచ్ నటరాజ్, కర్నూలు డిస్ట్రిక్ట్ అక్వాటిక్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు నరసింహాచారి, రామకృష్ణ యాదవ్ అభినందించారు.

