వైయస్ జగన్మోహన్ రెడ్డి ని ఏక వచనం తో మాట్లాడటం మానుకొండి
1 min read

మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ని ఏక వచనం తో మాట్లాడటం మానుకొని అభివృద్ధి చేసి చూపండి అని ఎమ్మెల్యే జయ నాగేశ్వర్ రెడ్డి కి హితువు పలికన శ్రీమతి బుట్టా రేణుక
ఎమ్మిగనూరు, న్యూస్ నేడు: ఎమ్మిగనూరు పట్టణంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీమతి బుట్టా రేణుక గారు మాట్లాడుతూ ఎంపీగా,ఎమ్మెల్యేగా,ముఖ్యమంత్రిగా, చేసిన మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏకవచనంతో మాట్లాడేటప్పుడు మనస్థాయి ఏమో తెలుసుకోవాలని ఎమ్మెల్యే జయ నాగేశ్వర్ రెడ్డి గారిని ప్రశ్నించారు. ఒక ఉన్నత స్థాయి వ్యక్తిపై ఆరోపణలు మానుకొని అభివృద్ధి చేసి చూపించాలని,ఎమ్మిగనూరు నియోజకవర్గంలో గత వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో నీటి స్టోరేజ్ కొరకు గోనెగండ్ల గాజులదిన్నె ప్రాజెక్ట్ ను ఒక మీటర్ ఎత్తు పెంచి, సాగు తాగునీరుకి ఉపయోగపడేలా అభివృద్ధి దిశగా మా ప్రభుత్వం తీసుకొచ్చింది ,గత టిడిపి ప్రభుత్వంలో ఏపీఐఏసి స్కీం జీవో వచ్చిన కూడా మా ప్రభుత్వంలో తాగునీటి కోసం ఇంటింటి కొలాయి స్కీమును పూర్తి అయ్యే దిశగా తీసుకొచ్చాం అలాంటి పనులు మీరు పూర్తిచేయాలి అని, అంతేకానీ రెండుసార్లు ఎమ్మెల్యేగా అయిన మీరు ఒక మాజీ ముఖ్యమంత్రిని ఏక వచనం తో జగన్ అని మాట్లాడడం సమంజసం కాదు అని అన్నారు.ఎమ్మిగనూరు పట్టణంలో వీధి కుక్కలు ఎక్కువగా ఉన్నాయి అని ప్రజలు ప్రశ్నిస్తే మున్సిపాలిటీ చైర్మన్ వైయస్సార్ పార్టీ వాళ్ళదని అని మాట్లాడడం సమంజసం కాదని ఆయన ఒక ఎమ్మెల్యే అని మర్చిపోయాడని శ్రీమతి బుట్టా రేణుక అన్నారు.ఎమ్మిగనూరు పట్టణంలోని మాచాని బాలికల పాఠశాలలో ఉన్న ప్రధాన సమస్యలను బుట్టా ఫౌండేషన్ ద్వారా మేము డ్రింకింగ్ వాటర్,బాత్ రూములు, మేము చేయిస్తామని అంటే, మీరు అడ్డుకొని మా ప్రభుత్వం ఉంది మేమే చేయిస్తాం అని మూడు నెలలు అవుతున్న ఆ సమస్యలను తీర్చడం లేదు, ఆ సమస్యపై విద్యార్థులే ఈరోజు ప్రశ్నించే విధంగా మారిందని అన్నారు. ఇప్పుడైనా ఆ సమస్యలను తీర్చే విధంగా చేయాలని డిమాండ్ చేశారు.
ఎంపీ మిథున్ రెడ్డి అక్రమ అరెస్టును ఖండించిన శ్రీ మతి బుట్టా రేణుక
శ్రీమతి బుట్టా రేణుక మాట్లాడుతూ ఒక ఎంపీ హోదాలో ఉన్న వ్యక్తి ఎక్కడ తప్పు జరిగింది చూపించండి అని అడిగితే కూడా చూపించకుండా అక్రమంగా అరెస్ట్ చేయడం తగదని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలనే ఉద్దేశంతో అక్రమ అరెస్టులు చేస్తే ఎవరు భయపడరని, న్యాయవ్యవస్థ ద్వారా అన్ని పరిష్కారాలు చేసుకుంటామని అన్నారుఈ కార్యక్రమంలో పార్టీసీనియర్ నాయకులు బుట్టా శివ నీలకంఠ,రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షులు బుట్టా ప్రతుల్ , రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, పట్టణ, గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

