బాబు షూరిటీ .. మోసం గ్యారంటీ ఇంటి ఇంటికి వంచన…!!!
1 min read

పాణ్యం నియోజకవర్గం : కల్లూరు అర్బన్ 19వ వార్డు 4th class employes colony లో చంద్రబాబు షూరిటీ — మోసం గ్యారంటీ ఇంటింటికి వంచన కార్యక్రమం నిర్వహించారు…!!! హామీల అమలులో “కూటమి విఫలం”
కల్లూరు అర్బన్ న్యూస్ నేడు : 19వ వార్డు 4th class employes colony లో “బాబు షూరిటీ — మోసం గ్యారంటీ” కార్యక్రమంలో భాగంగా పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడారు.కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు అని ప్రజలను మోసం చేశారు.. ఎలక్షన్ల ముందర ఇచ్చిన షూరిటీ బాండ్లను ప్రజలకు చూపిస్తూ చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేశారని అని తెలిపారు.కూటమి ప్రభుత్వంలో కరెంట్ బిల్లులు ఎక్కువగా వస్తున్నాయి అని ప్రజలు తెలిపారు.ఎవరిని అడిగిన కూడా సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు.. ప్రతిదాంట్లో కోతలు పెట్టి పథకాలు కొందరికె ఇస్తున్నారు అని వాపోయారు..వార్డులో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి.. అలాగే ఒక్కరికి కూడా కొత్త పింఛన్లు ఇవ్వలేదని తమ గోడువెళ్లబోసుకున్నారు. చంద్రబాబు నాయుడు చేసిన మోసాలను ప్రజలు గమనించాలని గుర్తు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన క్యూఆర్ కోడ్ ను ప్రజలతో స్కాన్ చేయించి చంద్రబాబు చేసిన మోసాలను తెలుసుకోవాలని అన్నారు… పూర్తిస్థాయిలో నాయకులు,కార్యకర్తలు, గ్రామంలో పర్యటించేందుకు కమిటీలు ఏర్పాటు చేసమని తెలిపారు ప్రతి గ్రామంలో 9 మంది కమిటీ సభ్యులు ఉంటారు రెండు గ్రామాలకు ఒక పరిశీలకులను నియమించినట్టు వైయస్సార్సీపి నంద్యాల జిల్లా అధ్యక్షులు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి తెలిపారు..ఈ కార్యక్రమంలో కర్నూలు నగర మేయర్ బివై రామయ్య ,బెల్లం మహేశ్వర రెడ్డి , నల్లబోలు గోపాల్ రెడ్డి ,లక్ష్మీపతి ,సంతోష్ ,రమణ ,సుభాషిణి ,తిరుపాల్ ,చంద్రకళ ,పద్మ ,ప్రమీల ,శ్రీను , మోహన్ , వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు అరుణ ,లక్ష్మీ రెడ్డి ,సుదర్శన్ రెడ్డి ,నారాయణ రెడ్డి ,నాయకులు బాలచంద్ర రెడ్డి , పర్ల సుంకన్న ,ఎద్దుల శివ రెడ్డి ,తిరుపాల్ , తిరుమలేశ్ గౌడ్ , భీమశంకర్ రెడ్డి , ఇనుస్ భాష ,దుర్గా ప్రసాద్ ,మధు మోహన్ రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి ,బస్తిపాడు రమణారెడ్డి ,అశోక్ రెడ్డి మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

