NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కేరళ  మాజీ ముఖ్యమంత్రి, కమ్యూనిస్టు కురువృద్ధుడు కు ఘన నివాళి

1 min read

పత్తికొండ, న్యూస్​ నేడు:  కమ్యూనిస్టు పార్టీ కురువృద్ధుడు కేరళ మాజీ సీఎం వి.ఎస్.అచ్యుతానందన్ మృతి సిపిఎ కు తీరని లోటని సిపిఎం మండల కార్యదర్శి చక్రాల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. మంగళవారం పత్తికొండ పట్టణంలోని స్థానిక మాజీ ఎమ్మెల్యే ఎర్రగుడి ఈశ్వర్ రెడ్డి భవనం నందు మంగళవారం కేరళ మాజీ ముఖ్యమంత్రి విఎస్ అచ్యుతానందన్ చిత్రపటానికి సిపిఎం పార్టీ నాయకులు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి సిఐటియు మండల నాయకులు ఎం. రవిచంద్ర, అధ్యక్షతన వహించగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి చక్రాల వెంకటేశ్వర్ రెడ్డి, సీనియర్ నాయకులు వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే ఎర్రగుడీశ్వర్ రెడ్డి తనయుడు అడ్వకేట్  రంగారెడ్డి, ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అచ్యుతానందన్ ట్రేడ్ యూనియన్ కార్యకలాపాల ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించి 1938లో స్టేట్ కాంగ్రెస్‌లో చేరారని. 1940లో, ఆయన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సిపిఐ)లో సభ్యుడయ్యారని. రాజకీయ నాయకుడిగా తన 40 సంవత్సరాల కాలంలో ఐదు సంవత్సరాల ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించి, నాలుగున్నర సంవత్సరాలు అజ్ఞాతంలో ఉన్నారని వారు తెలిపారు. 1957లో ఆయన సిపిఐ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యుడిగా ఉన్నారని.  1962 భారత-చైనా యుద్ధంలో , ఆయన భారత సైనికుల కోసం రక్తదాన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సిపిఐ అధికారిక వైఖరిని ధిక్కరించారని, దీని ఫలితంగా ఆయన అరెస్టు కాబడి పార్టీ రాష్ట్ర సెక్రటేరియట్ నుండి తొలగించబడ్డారని తెలిపారు. 1964లో సిపిఐ జాతీయ మండలి నుండి వైదొలిగి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)ను స్థాపించిన 32 మంది సభ్యులలో ఆయన ఎక్కువ కాలం జీవించారని అన్నారు.

About Author