NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమం నిర్వహించిన బి.వీరభద్రగౌడ్

1 min read

ఆలూరు న్యూస్ నేడు:  తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు,మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమంలో భాగంగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి,ఐటి అండ్​ మానవవనరుల,విద్యాశాఖ మంత్రి వర్యులు.నారా లోకేశ్ బాబు మరియు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు .పల్లా శ్రీనివాస్ రావు యాదవ్  ఆదేశానుసారం… ఆలూరు తాలూకా తెలుగుదేశం పార్టీ ఇంచార్జి, బి.వీరభద్రగౌడ్  చిప్పగిరి మండలంలోని నెమకల్లు గ్రామంలో పర్యటించారు.అలాగే నేమకల్లు గ్రామ టిడిపి నాయకులు వాల్మీకి సుధాకర్ మరియు జిల్లా తెలుగు యువత మాజీ అధికార ప్రతినిధి,జిల్లా ఐటిడిపి మాజీ అధ్యక్షులు రవి యాదవ్  నిర్వహించిన  శ్రీశక్తి సుంకులమ్మ అమ్మ వారి దేవర పూజా కార్యక్రమానికి కూడా హాజరయ్యారు. ఈకార్యక్రమంలో యువ నాయకులు గిరిమల్లేశ్ గౌడ్  మరియు నేమకల్లు గ్రామ టిడిపి నాయకులతో  పాటు చిప్పగిరి మండల టిడిపి సీనియర్ నాయకులు, కార్యకర్తలు,టిడిపి ఎంపీటీసీ లు, సర్పంచ్ లు,మండల టిడిపి క్లస్టర్,యూనిట్ ఇంచార్జి లు,బూత్ ఇంచార్జి లు మరియు వివిధ హోదాలలో ఉన్న కూటమి ప్రభుత్వ ప్రజా ప్రతినిధులు తెలుగు యువత,ఐటిడిపి  ,టిఎన్​ఎస్​ఎఫ్​ , టిడిపి సోషల్ మీడియా ప్రతినిధులు అందరూ పెద్దఎత్తున పాల్గొన్నారు.

About Author