పి-4 గ్రామ సభలు అర్ధవంతంగా నిర్వహించాలి
1 min read

నిర్వహించిన గ్రామసభ వివరాలు వెంటనే అప్ లోడ్ చేయాలి
బంగారు కుటుంబాల అవసరతను గుర్తించే సర్వే పకడ్బందీగా ఉండాలి
అధికారులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : పేదరిక నిర్మూలనే ధ్యేయంగా ప్రభుత్వం చేపట్టిన పి-4 కార్యక్రమం గ్రామ సభలు అర్దవంతంగా నిర్వహించి, నిర్వహించిన గ్రామసభల వివరాలను తక్షణమే అప్ లోడ్ చేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం పి-4 కార్యక్రమం గ్రామసభల నిర్వహణ, బంగారు కుటుంబాలు,మార్గదర్శకుల ఎంపిక తదతర అంశాలపై టెలీకాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ రాష్ట్రంలో సున్నా పేదరికమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని గౌ. ముఖ్యమంత్రి రూపొందించారన్నారు. ఇందులో భాగంగా జిల్లాలో బుధవారం నిర్వహించిన గ్రామసభల వివరాలను తక్షణమే అప్ లోడ్ చేయాలని మిగిలిన గ్రామసభలను రేపటికల్లా పూర్తిచేయాలన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యానికి తావులేదని కలెక్టర్ వెట్రిసెల్వి స్పష్టం చేశారు. బంగారుకుటుంబాలను గుర్తించడంలో భాగంగా కొత్తగా గుర్తించిన వారిని, అనర్హుల జాబితాలను గ్రామ సభలో వివరించాలన్నారు. అదే విదంగా బంగారు కుటుంబాల జాబితాను మరోమారు పరిశీలించి అవసరమైన వివరాలను పొందుపరచాలన్నారు. అనంతరం ఆయా కుటుంబాల అవసరాలను తెలుసుకుని అందుకు అనుగుణంగా మార్గదర్శకులను ఎంపిక చేసుకోవాలన్నారు. బంగారు కుటుంబాలుగా గుర్తించిన వారిని దత్తతతీసుకునేందుకు ఆయా గ్రామ, మండల పరిధిలో పారిశ్రామిక వేత్తలు, ఎన్ఆర్ఐలు, వితరణలు తదితరులతో సమావేశం నిర్వహించి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేవారి జాబితాలను వెంటనే సద్ధం చేసుకోవాలన్నారు. సమావేశంలో జెడ్పి సిఇఓ ఎం.శ్రీహరి,యంపిడివోలు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు,తదితరులు పాల్గొన్నారు.

