సోమప్ప సర్కిల్ పేరు అసలు మారదు..
1 min read

ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారిని చేనేతలను దూరం చేయాలనే కుట్ర చేస్తున్నారు
విభేదాలు సృష్టించదమే కోనేరు పని
ప్రజలు కోనేరు నాగేంద్ర చేస్తున్న తప్పుడు ప్రచారాలు నమ్మవద్దు_
పట్టణం సుందిరీకరణలో భాగంగా జాతీయ జెండాను పెడుతున్నాం_
ఎన్ని తరాలు వచ్చిన సోమప్ప పేరు మర్చిపోయే ప్రసక్తే లేదు
టీడీపీ నాయకులు వెల్లడి
ఎమ్మిగనూరు న్యూస్ నేడు: ఎమ్మిగనూరు పట్టణంలో నడిబొడ్డున సోమప్ప సర్కిల్ పేరు మారుస్తున్నారన్న అపోహలు ప్రజలు నమ్మవద్దని, సోమప్ప సర్కిల్ పేరు అసలు మారదని, సోమప్ప సర్కిల్ వద్ద 100 అడుగుల జాతీయ జెండాను ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఎమ్మెల్యే డాక్టర్ బీవీ. జయ నాగేశ్వర్ రెడ్డి గారు ఆలోచన చేశారని దాన్ని కోనేరు నాగేంద్ర ప్రసాద్ వక్రీకరిస్తూ, జాతీయ జెండాను పెడితే సోమప్ప సర్కిల్ పోతుందని మాట్లాడడం అవివేకంగా ఉందని టీడీపీ పట్టణ అధ్యక్షులు మాచాని మహేష్, చేనేత టీడీపీ నాయకులు దామా నరసింహులు, టౌన్ బ్యాంకు వైస్ చైర్మన్ బండా నరసప్ప, నాయకులు మీనప్ప, ఈరన్న, బుగిడె నాగరాజు, కామర్తి మహేష్, హరి, బీమేష్ లు పేర్కొన్నారు. గురువారం వారు మాట్లాడుతూ ఎమ్మిగనూరు నడిబొడ్డున సోమప్ప సర్కిల్ పేరు ప్రసిద్ధి చెందింది, ఎమ్మిగనూరు మున్సిపాలిటీ స్పెషల్ గ్రేడ్ కావడం పట్ల సుందిరీకరణలో భాగంగా అనేక మార్పులు, చేర్పులు జరుగు తున్నాయన్నారు. ఎన్ని తరాలు వచ్చిన సోమప్ప పేరు మర్చిపోయే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎమ్మిగనూరు కోస్గి పంచాయతీ పరిధిలో ఉంటే దాన్ని రప్పించిన మాచాని సోమప్ప, అలాగే మున్సిపాలిటీని అభివృద్ధి చేశారు, వైడబ్యూసిఎస్, టౌన్ బ్యాంకు, స్పిన్నింగ్ మిల్లు, వివర్స్ కాలనీ వంటిది స్థాపించిన వ్యక్తి సోమప్పను మర్చిపోవడం సాధ్యం కాదన్నారు. దుబాయ్ లో కూడా ట్రాన్స్ పోర్ట్ నడిపిన వ్యక్తి సోమప్ప కు పద్మశ్రీ అవార్డు వచ్చిందంన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డికు వివర్స్ ఉన్న పట్టు, ఆదరణ ను ఓర్వలేక దూరం చేయాలనీ కుట్రకు పన్నుతున్నారని మండిపడ్డారు. కోనేరు కులాల మధ్య చిచ్చు పెట్టడమే పనిగా పెట్టుకున్నాడని, టీడీపీకి చేనేతలను దూరం చేయాలనీ ఎన్ని ప్రయత్నాలు చేసిన సాధ్యం కానీ పని, చేనేతలవైపు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి అండగా ఉన్నారని స్పష్టం చేశారు. విభేదాలు సృష్టించదమే కోనేరు పనిగా పెట్టుకున్నారని, ప్రజలు కోనేరు లాంటి తప్పుడు ప్రచారాలు నమ్మవద్దు కోరారు. జాతీయ జెండా ఎక్కడైనా నడిబొడ్డున పెడుతారని, హైదరాబాద్ లో గోల్కొండలో పెడితే గోల్కొండ ప్రాధాన్యత తగ్గిందా అంటి ప్రశ్నించారు. ఎమ్మిగనూరుని అభివృద్ధి చేసింది సోమప్ప ఆ తరువాత బీవీ మోహన్ రెడ్డి అని గుర్తు చేశారు. జాతీయ జెండా పెడితే మాత్రాన సోమప్ప సర్కిల్ పేరు కనుమరుగ కాదు.. కేవలం కొందరూ గిట్టని వారు అసత్య ప్రచారాలు చేస్తున్నారని వారి ప్రచారాలను నమ్మవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ చేనేత నాయకులు పాల్గొన్నారు.

