రాఘవేంద్రుని 354 వ ఆరాధనోత్సవాలకు రండి
1 min read

టిడిపి జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి ని ఆహ్వానించిన పీఠాధిపతులు శ్రీ సుభుధేంద్ర తీర్థులు
మంత్రాలయం న్యూస్ నేడు : ఆగస్టు లో 8 నుండి ప్రారంభమయ్యే రాఘవేంద్ర స్వామి 354 వ ఆరాధనోత్సవాలకు కుటుంబ సమేతంగా రావాలని శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుభుధేంద్ర తీర్థులు టిడిపి జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి ని ఆహ్వాన పత్రిక ఇచ్చి కోరారు. గురువారం ఆయన అమావాస్య కావడంతో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకునేందుకు వచ్చారు. వీరికి టిడిపి మండల అధ్యక్షులు పన్నగ వెంకటేష్ స్వామి, పూజారి వ్యాసరాజ్ స్వామి స్వాగతం పలికారు. వీరు ముందుగా గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళ హారతి ఇచ్చారు. అనంతరం రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరి కి శ్రీమఠం పీఠాధిపతులు శ్రీ సుభుధేంద్ర తీర్థులు శేష వస్త్రం కప్పి ఫలమంత్రాక్శితలు ఇచ్చి ఆశీర్వదించారు. అనంతరం రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాల ఆహ్వాన పత్రిక అందించి రావాలని కోరారు. శ్రీ మఠం లో జరుగుతున్న ఏర్పాట్లు, పుష్కరిణి నిర్మాణ పనులు ఆయన తో కలిసి పరిశీలించారు. వీరి వెంట యల్లారెడ్డి, విజయ రామిరెడ్డి, వట్టేప్ప నరసింహులు, సున్నం రామకృష్ణ, సంత మార్కెట్ పాఠశాల ఛైర్మెన్ సున్నం గురురాజ, హనుమంతు,టిడిపి జిల్లా మైనార్టీ అధ్యక్షులు వగరూరు అబ్దుల్, హిమాయత్, బెళగల్ ప్రభాకర్ రెడ్డి,సాతునూరు ఉలిగయ్య,కంబళదిన్ని శ్రీనివాస్, రచ్చమరి రామయ్య, చెట్నహల్లి తిక్క స్వామి గౌడ్, రవి తదితరులు పాల్గొన్నారు.


