NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శర వేగంగా పైప్‌లైన్ మరమ్మతు పనులు

1 min read

నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్

కర్నూలు మున్సిపల్, న్యూస్ నేడు : సంతోష్ నగర్ వద్ద జాతీయ రహదారిపై ప్రధాన తాగునీటి పైప్‌లైన్ లీకేజీ మరమ్మత్తు పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టినట్లు నగరపాలక కమిషనర్ పి.విశ్వనాథ్ వెల్లడించారు. గురువారం ఆయన మరమ్మత్తు పనులను పరిశీలించారు. ప్రజలకు తాగునీటి సరఫరాకు తిరిగి ప్రారంభించేందుకు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఒక పైపునకు మరమ్మత్తులు పూర్తి అయ్యాయని, మరో పైపునకు మరమ్మత్తు పనులు చురుగ్గా సాగుతున్నాయన్నారు. కార్యక్రమంలో ఇంచార్జీ ఎస్‌ఈ శేషసాయి, డిఈఈలు గిరిరాజ్, మనోహర్ రెడ్డి, ఏఈలు జనార్ధన్, ప్రవీణ్ కుమార్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

అపరిష్కృత సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి

దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని నగరపాలక కమిషనర్ పి.విశ్వనాథ్ సూచించారు. గురువారం ఆయన ఖడక్‌పుర, వడ్డేగిరి ప్రాంతాల్లో పర్యటించారు. కార్యక్రమంలో ప్రజారోగ్య అధికారి డాక్టర్ విశ్వేశ్వర్ రెడ్డి, పారిశుద్ధ్య పర్యవేక్షక అధికారి నాగరాజు, తనిఖీదారులు జిలానీ, ముర్తుజ వలి, ట్రైనీ ఏఈ మహేష్, తదితరులు పాల్గొన్నారు.

About Author