దేశ వ్యాప్తంగా 500కి పైగా హిమాలయ బేబీకేర్ తల్లి పాలు పట్టే గదులు
1 min read

విశాఖపట్నం, న్యూస్ నేడు : తల్లి మరియు శిశువు ఆరోగ్యకరమైన జీవనాన్ని ఇవ్వాలంటే, తల్లిపాలు ఇవ్వడం చాల కీలకమైనది. ఇందులో భాగంగా తల్లిపాలు ఇవ్వడం ప్రోత్సహించడంలో భాగంగా, హిమాలయ బేబీ కేర్ భారతదేశవ్యాప్తంగా 500కి పైగా తల్లి పాలు పట్టే గదులను విజయవంతంగా ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. శుభ్రత, గోప్యత, తల్లి సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ గదులు తల్లులకు గౌరవంతో కూడిన అనుభూతిని అందిస్తున్నాయి.ప్రస్తుతం దేశవ్యాప్తంగా 502 గదులు కార్యాచరణలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నుండి ముంబయి, బెంగళూరు, హైదరాబాద్, కోలకతా వంటి ప్రధాన రవాణా కేంద్రాల వరకు దేశవ్యాప్తంగా 27 విమానాశ్రయాలలో తల్లి పాలు పట్టే గదులు ఏర్పాటు చేయబడ్డాయి. అలాగే, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్‌లలోని ముఖ్యమైన రైల్వే స్టేషన్లు సహా 33 రైల్వే స్టేషన్లలో ఈ గదులు అందుబాటులోకి వచ్చాయి. అంతేకాక, మెట్రో నగరాలు మరియు ప్రాంతీయ కేంద్రాల్లోని ఆసుపత్రులు, అధిక జనసంచార ప్రాంతాల్లో మొత్తం 141 ఆసుపత్రుల్లో 268 గదులు ఏర్పాటు చేయబడ్డాయి.హిమాలయ నిర్వహించిన సర్వే ప్రకారం, ప్రతి గది రోజుకు సగటున 30 తల్లులు ఉపయోగిస్తున్నారని తేలింది. వార్షికంగా 5.5 మిలియన్లకుపైగా తల్లులు ఈ సౌకర్యాలను ఉపయోగిస్తున్నట్లు అంచనా.ఈ సందర్భంగా హిమాలయ వెల్‌నెస్ కంపెనీ బేబీకేర్ డైరెక్టర్ శ్రీ చక్రవర్తి ఎన్ వి మాట్లాడుతూ, “తల్లుల అవసరాలు, శిశువుల శ్రేయస్సే మా లక్ష్యం. ఈ గదులు తల్లులకు కావలసిన గోప్యతను, సౌకర్యాన్ని అందించే దిశగా మేము వేసిన మరో మైలురాయి,” అని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా హిమాలయ బేబీకేర్ తల్లి-శిశు సంక్షేమాన్ని ప్రోత్సహిస్తూ, సామాజిక పరివర్తనకు మార్గం సుగమం చేస్తోంది.

