జిల్లా యోగ సంఘం ఎన్నికలు ఏకగ్రీవం
1 min read

కర్నూలు, న్యూస్ నేడు : జిల్లా యోగ సంఘం ఎన్నికలు ఆదివారం కర్నూలు నగరంలోని కృష్ణ నగర్ లో ఉన్న జిల్లా యోగ సంఘం కార్యాలయంలో నిర్వహించారు. ఈ ఎన్నికలలో జిల్లా సంఘం చైర్మన్ గా దండు లక్ష్మీకాంత రెడ్డి,అధ్యక్షుడిగా అవినాష్ శెట్టి, కార్యనిర్వాహక అధ్యక్షురాలుగా డాక్టర్ ఎస్. ముంతాజ్ బేగం,ప్రధాన కార్యదర్శిగా కురువ మునిస్వామి,కోశాధికారిగా కుమ్మరి విజయకుమార్, ఉపాధ్యక్షులుగా ఎం.వి సాయికృష్ణ, బి. శ్రీనివాసులు, ఎం.శశిధర్,ఏ.బ్రహ్మానంద రెడ్డి,సంయుక్త కార్యదర్శిలు గా లోకేష్, విజయ భాస్కర్ రెడ్డి,దండు విద్యాసాగర్, కేశవ,కార్యవర్గ సభ్యులుగా నాగ గణేష్, శ్రీనివాసులు, టి లక్ష్మీకాంత్,కే.విశ్వ తేజ, రోజా మణి, రవి లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి అడ్వకేట్ శ్రీనివాసులు ప్రకటించారు. ఒలంపిక్ సంఘం నుంచి జిల్లా ఒలంపిక్ సంఘం కార్యదర్శి జి.శ్రీనివాసులు అబ్జర్వర్ గా వ్యవహరించగా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ నుంచి ఎన్నికలకు పరిశీలకులుగా అథ్లెటిక్స్ శిక్షకుడు కాశీ రావు,రాష్ట్ర యోగ సంఘం నుంచి ఎన్నికల పరిశీలకులుగా ఈశ్వర్ నాయుడులు వ్యవహరించారు.ఈ సందర్భంగా నూతన సంఘం చైర్మన్ దండు లక్ష్మీకాంత్ రెడ్డి,అధ్యక్షుడు అవినాష్ శెట్టి లు మాట్లాడుతూ జిల్లాలో కలిసికట్టుగా యోగ అభివృద్ధికి కృషి చేద్దామన్నారు.యోగ క్రీడాకారుల సంక్షేమానికి ఎన్నికైన ప్రతి సభ్యుడు కృషి చేయాలని పిలుపునిచ్చారు. నూతన కమిటీ నాలుగు సంవత్సరాల పాటు కొనసాగుతుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కృషితో యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందన్నారు. విశాఖపట్నంలో జరిగిన యోగేంద్ర కార్యక్రమం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకోవడం జరిగిందన్నారు. ఈ గిన్నిస్ రికార్డులో తాము కూడా ప్రతినిత్యం వహించినందుకు సంతోషంగా ఉందన్నారు. యోగ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా గోల్డెన్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహిస్తామన్నారు.

