వయోజనులందరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలి
1 min read

నిరక్ష రాస్యులను, అక్షరాస్యులుగా తీర్చిదిద్దటమే “ఉల్లాస్ అక్షరాంధ్ర” లక్ష్యం
డిఆర్ డిఎ పిడి డా:ఆర్. విజయ రాజు
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : నిరక్షరాస్యులైన వయోజనులందరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్ధేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ”ఉల్లాస్ అక్షరాంధ్ర” అక్షరాస్యత కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డిఆర్డిఏ పిడి డా:ఆర్. విజయరాజు అన్నారు. జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి వారి ఆదేశాల మేరకు వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో శనివారం వట్లూరు టిటిడిసి నందు జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా డిఆర్డిఏ పిడి ఆర్.విజయ రాజు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జిఎస్ డబ్ల్యూఎస్ శాఖ ద్వారా 2023 సంవత్సరంలో నిర్వహించి న క్యాస్ట్ సర్వే ద్వారా జిల్లాలో 3, 44 184 మంది వయోజనులైన నిరక్షరాస్యులను గుర్తించడం జరిగిందన్నారు. వారి నుండి ఏలూరు జిల్లాలో మొదటి విడతగా ఈ ఏడాది 97,200 మంది వయోజను లైన నిరక్షరాస్యులు తీసుకుని, వారందరిని అక్షరాస్యులుగా చేయడానికి సంబంధిత శాఖల ద్వారా యాక్షన్ ప్లాన్ రూపొందించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినట్లు తదుపరి మూడు సంవత్సరాల లో మొత్తం 3,44,184 మంది నిరక్షరాస్యులైన వయోజనులను అక్షరాస్యులు గా చేసి ,రాబోయే మూడు సంవత్సరాలలో ఏలూరు జిల్లాని అక్షరాస్యతలో మొదటి స్థానంలోకి తీసుకుని రావాలని ఆయన పిలుపునిచ్చారు.శిక్షణా కార్యక్రమం కో-ఆర్డినేటరు, జిల్లా వయోజన విద్య నోడల్ అధికారి కె.వి.వి సత్యనారాయణ మాట్లాడుతూ గత సంవత్సరం ఉల్లాస్ అక్షరాస్య కార్యక్రమను జిల్లాలో ఉన్నటువంటి 27 మండలాల్లో నిరక్షరాస్యులైన డ్వాక్రా గ్రూపు మహిళలను గుర్తించి జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి వారి ఆదేశాలతో డిఆర్డిఏ పిడి సహకారంతో అందరిని అక్షరాస్యులుగా తయారు చేయడం జరిగిందన్నారు. తద్వారా రాష్ట్ర స్థాయిలో ఉల్లాస్ అక్షరాస్యత కార్యక్రమంలో ఏలూరు జిల్లా రెండవ స్థానం సాధించిందన్నారు. ఆగస్టు నెల 1వ తారీకు నుండి 6వ తారీకు వరకు ఒకరోజు వాలంటరీ టీచర్స్ కి, రిసోర్స్ పర్సన్స్ కి మండల స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు ఎంపీడీవో ఆధ్వర్యంలో నిర్వహిస్తామన్నారు. ఆగస్టు 7వ తేదీ నుండి 2026 ఫిబ్రవరి ,20 వ తేదీ వరకు 100 గంటల తరగతులు నిర్వహిస్తామన్నారు. ఈ తరగతుల్లో లెర్నర్స్ కి రెండు ప్రైమరీ పుస్తకాలు, అలాగే ఐదు మోడల్ పేపర్స్ ఇవ్వడం జరుగుతుందని, వయోజను లైన నిరక్షరాస్యులకు, ఫైనాన్షియల్ లిటరసీ, డిజిటల్ లిటరసీ, మరియు ఫంక్షనల్ లిటరసీ లలో శిక్షణ ఇవ్వటం జరుగుతుందన్నారు. తదుపరి 2026 మార్చి నెలలో వారికి పరీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు. సమావేశంలో జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ భీమేశ్వరరావు, డ్వామా ఏపిడి రాజశేఖర్,ఏలూరు డిఎల్పిఓ , అన్ని మండలాలు ఎంపీడీవోలు, ఏపీడి డిఆర్డిఏ, ఆయా ఐసిడిఎస్ సిడిపివోలు, అన్ని మండలాలు ఎంఈఓ లు, ఏపిఎంలు, ఏపీవోలు, మెప్మా సీఎం ఎం లు మరియు వయోజన విద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


