NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

27వ డివిజన్ లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం

1 min read

భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం ప్రజలకు మరిన్ని సేవలు అందిస్తాయి

ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే బడేటి చంటి

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు  : సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఈరోజు స్థానిక 27వ డివిజన్ నందు కండ్రికగూడెం సెంటర్ నందు ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) పర్యటించి ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం సంవత్సర పాలనపై ప్రజలు పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, ఎన్నికలకు ముందు పర్యటించిన సమస్యలలో తమ సమస్యలు ఏకరేవు పెట్టిన ప్రజలు ప్రస్తుతం తాము పర్యటిస్తున్న సందర్భంగా పూర్తిస్థాయిలో సంతోషం వ్యక్తం చేస్తున్నారని కూటమి ప్రభుత్వ హయాంలో ప్రజా సమస్యలన్నీ ఒక కొలిక్కి వస్తున్నాయని భవిష్యత్తులో ప్రజలకు మరిన్ని మేలు చేకూరుతాయని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 27వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ యడ్లపల్లి శివ, కో-ఇంచార్జ్ బోడెం వెంకటరావు, క్లస్టర్ ఇంచార్జ్ రెడ్డి నాగరాజు, కో- క్లస్టర్ ఆర్మేపల్లి తిరుపతి, డివిజన్ ప్రెసిడెంట్ కోనేరు పద్మ,ఈడా చైర్మన్ పెద్ది బోయిన శివప్రసాద్, ఏఎంసి చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారథి, కో-ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు,తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, తెలుగుదేశం పార్టీ నాయకులు బడిశెట్టి శ్రీను,కోనేరు వంశీ,బెజ్జం అచ్చాయమ్మా, కడియాల పూర్ణచంద్రరావు,కందుల రమేష్,అడ్డాల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

About Author