NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నాణ్యతా ప్రమాణాలపై అవగాహన సదస్సు

1 min read

బిఐఎస్ ప్రమాణాలను అనుసరించడం వినియోగదారులకు, పరిశ్రమలకు లాభదాయకం

నాణ్యతకు బిఐఎస్ నిదర్శనం

పారిశ్రామికాభివృద్ధికి నూరుశాతం ప్రోత్సాహం అందిస్తాం

బిఐఎస్ నాణ్యతా ప్రమాణాలపై నిర్వహించిన వర్క్ షాప్ లో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు : ఉత్పత్తుల తయారీలో నాణ్యతా ప్రమాణాలు పాటించడం వలన వినియోగదారుల సంతృప్తి, బ్రాండ్ విధేయతను పెంపొందిస్తుందని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పేర్కొన్నారు.బుధవారం స్ధానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో పరిశ్రమల శాఖ, ఎఫ్ఎస్ఎంఇ తో కలిసి భారతీయ నాణ్యతా ప్రమాణాలపై(బిఐఎస్) నిర్వహించిన వర్క్ షాప్ ను జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి జ్యోతి ప్రజ్వలనచేసి ప్రారంభించారు.  ఈ సందర్బంగా పరిశ్రమలకు సంబంధించి ఎంఎస్ఎంఇ స్కీమ్ లపై, ఇండస్ట్రీయల్ వ్యూ పేరిట ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ రూపొందించిన పుస్తకాన్ని కలెక్టర్ వెట్రిసెల్వి ఆవిష్కరించారు. సమావేశ అనంతరం ఎంఎస్ఎంఇ పారిశ్రామిక వేత్తలకు మంజూరు పత్రాలను అందజేశారు.ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ పరిశ్రమల్లో ప్రమాణాలను అమలుచేయడం అనేది నాణ్యతా, భధ్రత, వినియోగదారుల నమ్మకం కోణంలో అత్యంత అవసరమేనన్నారు. భారతీయ నాణ్యతా ప్రమాణాలను(బిఐఎస్) అనుసరించడం మూలంగా నాణ్యమైన ఉత్పత్తుల తయారీకి సహకారం, వినియోదారుల నమ్మకాన్ని పొందడంతోపాటు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ లో పోటీతత్వం పెరుగుతుందన్నారు. బిఐఎస్ పై మరింత అవగాహన కల్పించేందుకు నియోజకవర్గ, మండల స్ధాయిలో వర్క్ షాప్ లు ఏర్పాటుచేయదలిస్తే అందుకు సహకరిస్తామన్నారు. జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి జిల్లా యంత్రాంగం నూరుశాతం ప్రోత్సహాన్ని అందిస్తుందని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి స్పష్టం చేశారు.  కొత్త ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు ఏవిదమైన సహకారానైనా అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రాజధాని అమరావతికి అతిచేరువలో ఉన్న ఏలూరు జిల్లాను అభివృద్ధిలో రాష్ట్రంలోనే మూడవస్ధానంలోకి తీసుకువచ్చేందుకు అన్ని విధాల కృషి జరుగుతుందన్నారు.  జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఇ పార్కుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టామన్నారు.  అమరావతి సిఆర్డి ఏ ప్రక్కన ఏలూరు జిల్లా ఉండుట వలన, అన్ని రవాణా సౌకర్యాలు ఉండడంతో పరిశ్రమలు స్థాపనకు,జిల్లా అభివృద్ధి చేసుకునుటకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఔత్సాహికులు,యువ పరిశ్రామిక వేత్తలు ముందుకు వస్తే భూములు కేటాయింపు, బ్యాంకు ఋణాలు,సబ్సిడీలు, తదితర సౌకర్యాలు కల్పిస్తామని పారిశ్రామిక సోదరులు ముందుకు రావాలని కోరారు. అంతే కాకుండా వ్యర్ధాలు, కాలుష్యం తగ్గి పర్యావరణ పరిరక్షణకు సాధ్యపడుతుందన్నారు. బిఐఎస్ శాస్త్రవేత్త డి. వివేక్ వర్ధన్ రెడ్డి పరిశ్రమల్లో బిఐఎస్ నాణ్యతా ప్రమాణాలు ఎందుకు ముఖ్యమైనవి, ఏవిధంగా పాటించాలో సమగ్రంగా వివరించారు. నాణ్యతా ప్రమాణాలను పాటించడం వల్ల ఉత్పత్తి పెరుగుతుందని తద్వారా కొత్త ఉద్యోగాలు సృష్టించడడానికి దారితీస్తుందన్నారు. కార్యక్రమంలో ఎఫ్ఎస్ఎంఇ కన్వీనర్ ఎం. వేణుగోపాల్, జిల్లా పరిశ్రమల అధికారి పి. సుబ్రహమణ్యేశ్వరరావు, ఎల్ డిఎం డి. నీలాంధ్రి, ఉపకార్మిక కమీషనర్ పి. శ్రీనివాసరావు, కాలుష్యనియంత్రణామండలి ఇఇ వెంకటేశ్వరరావు, స్కిల్ డెవలప్ మెంట్ ఆఫీసర్ ఎన్. జితేంధ్ర, పలువురు పారిశ్రామిక వేత్తలు, బ్యాంకర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

About Author