ఏసీబీ వలకు చిక్కిన అవినీతి చేప..
1 min read

లంచం అడిగితే మాకు ఫిర్యాదు చేయండి
ఏసీబీ డీఎస్పీ సోమన్న..
నందికొట్కూరు, న్యూస్ నేడు: రైతు వద్ద నుండి లంచం తీసుకుంటూ ఓ సీనియర్ అసిస్టెంట్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కడంతో అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయ్.రెవెన్యూ కార్యాలయాల్లో ఏ పని కావాలన్నా లంచం లేనిదే పనులు కావని అందరికీ తెలిసిన నగ్న సత్యం..నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా గ్రామానికి చెందిన రైతు ఈశ్వరయ్య వద్ద నుంచి ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ ఆర్ రమేష్ 40 వేలు లంచం తీసుకుంటూ సిబ్బందితో కలిసి కర్నూలు ఏసీబీ డీఎస్పీ సోమన్న రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సీనియర్ అసిస్టెంట్ ఏసీబీ అధికారులకు చిక్కడంతో రెవెన్యూ శాఖ అధికారులు ఉలిక్కిపడ్డారు.ఏసీబీ డీఎస్పీ తెలిపిన వివరాల మేరకు రైతు ఈశ్వరయ్యకు 80 బన్నూరు లో ఒక ఎకరా పొలం ఉంది.ఈ పొలం రిజిస్ట్రేషన్ అయింది పొలం అనుభవంలో ఉన్నాడు.ఆర్ఓఆర్ లో మార్చుకునేందుకు గాను 2020 నుండి కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఉన్నాడు స్పందనలో కూడా అర్జీ ఇచ్చినా సమస్య నెరవేర్చలేదు.ఆర్డీవో కార్యాలయంలో పనిచేసే రమేష్ నేను పని చేస్తానని చెప్పి మొత్తం 60వేలు డిమాండ్ చేయగా రైతు 50 వేలు ఇస్తానని ఒప్పుకున్నాడు. గత వారం క్రితం 10వేలు ఇచ్చాడు.గురువారం మ. ఒంటిగంట సమయంలో తాటిపాడు అంచ గోడౌన్ దగ్గరికి రమ్మని రమేష్ రైతుకు చెప్పాడు.రైతు ఈశ్వరయ్య 40 వేల రూ.లు సీనియర్ అసిస్టెంట్ రమేష్ కు నగదును ఇచ్చాడు.ఆ వెంటనేఏసీబీ అధికారులు చాకచక్యంగా వలపన్ని పట్టుకున్నారు.ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ మాట్లాడుతూ అధికారులు లంచం తీసుకోవడం నేరమే ఎవరైనా సరే అధికారులు లంచం అడిగితే మమ్మల్ని సంప్రదించాలని అన్నారు. ఫిర్యాదు దారుని సమస్యను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.రమేష్ ను విచారిస్తున్నామని వీటిలో ఇంకా ఎవరి పాత్ర అయినా ఉంటే వారిపై కూడా కేసు నమోదు చేస్తామని అన్నారు.ఈ దాడుల్లోఏసీబీ అధికారులు సీఐ కృష్ణయ్య ,ఎస్ఐ సుబ్బరాయుడు పాల్గొన్నారు.

