సాంఘిక సంక్షేమ హాస్టల్ల లోని సమస్యలను పరిష్కరించాలి
1 min read
విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలి
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు దత్త సాయి నియోజకవర్గ అధ్యక్షులు గుమ్మల్ల సాయి కుమార్ రెడ్డి
వల్లూరు, న్యూస్ నేడు: ప్రభుత్వ సాంఘిక సంక్షేమ హాస్టల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించి వారికి మెరుగైన వసతులు కల్పించాలని, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల పై సంబంధిత అధికారులు హాస్టలను ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని వైఎస్ఆర్సిపి విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు దత్త సాయి నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షులు గుమ్మల్ల సాయికుమార్ రెడ్డిలు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ హాస్టల్లో బాట కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే కమలాపురం నియోజకవర్గం లోని బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్లను సందర్శించడం జరిగిందని వారు అన్నారు. అందులో భాగంగా బుధవారం రాత్రి వల్లూరులోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహాన్ని పరిశీలించి అక్కడ విద్యార్థులతో వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా వారు హాస్టల్ విద్యార్థుల సమస్యల గురించి మాట్లాడుతూ, ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలో టాయిలెట్ల శుభ్రత లోపించిందని అక్కడ ఉన్న టాయిలెట్లు సక్రమంగా శుభ్రపరచక పోవడంతో దుర్వాసన వెదజల్లుతున్నదని, అదేవిధంగా వాటర్ ట్యాంకు దానికి సంబంధించిన పైపులైన్లు కుళాయిలు కూడా సక్రమంగా లేవని దీంతో విద్యార్థుల ఇక్కట్లు అంతా ఇంత కాదని దీనిపై అధికారులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇక్కడ సమస్యలు ఎక్కువగా తిష్ట వేశాయని ఉన్నాయని వారు తెలియజేశారు, హాస్టల్ల లోని విద్యార్థులు అరకొర సదుపాయాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుందని అక్కడి విద్యార్థులు వాపోడం జరిగిందని ఆయన తెలిపారు. అంతేకాకుండా అక్కడి సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకుని సమగ్రంగా ఆ సమస్యలను అధ్యయనం చేయడం జరిగిందని వారు తెలియజేశారు. అధికారులు హాస్టలను తనిఖీ చేసి అక్కడ విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకుని వారి సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నం చేయాలని వారు సంబంధిత అధికారులను కోరుతున్నామని తెలిపారు. హాస్టళ్లకు సంబంధించిన విషయాలను విద్యార్థి విభాగ నాయకులకు చెబితే వారిని అక్కడ సిబ్బంది ఏ విధంగానైనా ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని ఈ విషయాలు విద్యార్థులు క్షుణ్ణంగా తమకు తెలియజేశారని వారు అన్నారు. అధికారులు సమస్యలపైనే కాకుండా, విద్యార్థులతో మమేకమై వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నప్పుడు వారి సమస్యలు చెప్పడం జరుగుతుందని అధికారులు ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదని ఇది సరైన పద్ధతి కాదని ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించి వారికి మెరుగైన విద్యను అందించే దిశగా కృషి చేయాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్సీపి విద్యార్థి విభాగం అధ్యక్షులు చాంద్ భాషా, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


