పేదప్రజల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం …వీరభద్రగౌడ్
1 min read

ఆలూరు న్యూస్ నేడు: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు,మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ విషయంలో తీసుకువచ్చిన విషయం అందరికీ తెలిసిందే..ఇందులో భాగంగా ఈరోజు మన ఆలూరు తాలూకా ముద్దుబిడ్డ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి, బి.వీరభద్రగౌడ్ భర్త చనిపోయిన వారికి ఆలూరు పట్టణంలో వివిధ కలనీలలో పెన్షన్లు వారిచేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో ఆలూరు ఎంపీడీఓ ,పంచాయతీ కార్యదర్శి సచివాలయ సిబ్బంది అలాగే ఆలూరు మండల టిడిపి , బిజెపి ,జనసేన నాయకులు అలాగే ఆలూరు పట్టణ,టిడిపి సీనియర్ నాయకులు,కార్యకర్తలు, మండల టిడిపి సర్పంచ్ లు ఎంపీటీసీలు ,క్లస్టర్, యూనిట్ ఇంచార్జి లు,బూత్ ఇంచార్జి లు మరియు వివిధ హోదాలలో ఉన్న కూటమి ప్రభుత్వ ప్రజా ప్రతినిధులు తెలుగుయువత ఐటిడిపి, టిఎన్ఎస్ఎఫ్, టిఎన్టియుసి, సిబిఎన్ ఆర్మీ, టిడిపి, సోషల్ మీడియా ప్రతినిధులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


