అంగన్వాడీ వర్కర్స్ సమస్యలను పరిష్కరించాలి
1 min read

ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఏ.ఐ.టి.యు.సి ,ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సి. ఐ.టి.యు పత్తికొండ సి డి పి ఓ కు వినతి పత్రం అందజేత
పత్తికొండ, న్యూస్ నేడు: అంగన్వాడి వర్కర్స్ సమస్యలను పరిష్కరించాలని సిఐటియుల ఆధ్వర్యంలో అంగన్వాడీలు శుక్రవారం స్థానిక సిడిపిఓ కు వినతి పత్రం అందజేశారు. అంగన్వాడి సెంటర్ నిర్వహణకు ఇచ్చిన పొన్లు, పోషణట్రాకరు, బాల సంజీవిని యాప్స్ అమలుకు సపోర్ట్ చేయడం లేదని తెలిపారు. లబ్దిదారులు కు ఫోటో క్యాప్చర్, ఓటిపి, ఎఫ్ఆర్ఎస్ ద్వారా నే సరుకులు ఇవ్వాలని పెట్టిన నిబంధన అమలు చేయటానికి అంగన్వాడీలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన చెందారు. సరుకులు అన్నీ ఒక్క సారిగా రావడం లేదని, నెట్ సిగ్నల్ రాకపోవడం, సర్వరు పని చేయకపోవడం వలన లబ్ధిదారులు ఇబ్బంది ఇబ్బంది పడుతున్నారని అన్నారు.కావున అన్ని యాప్ లను కలిసి ఒక యాప్ గామార్పుచేయలని ఎఫ్ఆర్ఎస్ ఇన్, అవుట్ రద్దు చేయాలని , సెంటరు నిర్వహణకు ట్యాబుల్ ఇవ్వాలని 5జి నెట్ ఇవ్వాలని కోరుతూన్నాము. ఆగస్టు 4వ తేదీన సిడిపిఓ ఆఫీస్ లో పొన్లన్నీ తిరిగి ఇస్తామని, ఆగస్టు 5వ తేదీ నుండి అన్ లైన్ వర్క్ చేయలేమని తెలియజేస్తున్నాము. అంగన్వాడి లు సెంటర్ లోని హాజరు లబ్ధిదారుల ఆహారం పంపిణీ అన్ని యు రికార్డు వ్రాస్తామని తెలియజేస్తున్నాము. ప్రధానమంత్రి మాతృ వందనం పథకం నీ కొత్తగా అంగన్వాడీలకు అప్పగించరాదు. అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి మీనీలు ను మెయిన్ గా మార్చుతు జీవో ఇవ్వాలని. గ్రాట్యుటీ జీవోలో మార్పు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్స్ నాయకురాలు బి.కాంతమ్మ ఏఐటీయూసీ,పద్మజ సీఐటీయూ ఏఐటీయూసీ జిల్లా డిప్యూటీ కార్యదర్శి ఎన్ కృష్ణయ్య ఏఐటియుసి, సిఐటియు తాలూకా అధ్యక్ష, కార్యదర్శులు డి. గోపాల్.

