మిడుతూరు మండలంలో 93 పింఛన్ల మంజూరు
1 min read
నూతన పింఛన్లను పంపిణీ చేసిన అధికారులు నాయకులు..
మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్ నేడు : నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలో నూతనంగా 93 పింఛన్లు మంజూరు అయ్యాయని ఇన్చార్జి ఎంపీడీవో ఏ సురేష్ కుమార్ అన్నారు.గతంలో భర్త పింఛన్ తీసుకుంటూ మరణించిన వారి భార్యలకు ఈ పింఛన్లు మంజూరు అయ్యాయని వీరందరికీ మండలంలోని అన్ని గ్రామాల్లో పింఛన్లు పంపిణీ చేశామని నిన్న ఒకటవ తేదీన ఉదయం నుండి సాయంత్రం ఐదు గంటల వరకు అన్ని రకాల పింఛన్లు కలిపి 94.2 శాతం పింఛన్లను పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. మిడుతూరు గ్రామంలో మండల కన్వీనర్ ఖాతా రమేష్ రెడ్డి నూతన పింఛన్లను పంపిణీ చేశారు.అదేవిధంగా చింతలపల్లిలో సహకార సొసైటీ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. మాసపేటలో కమతం వీరారెడ్డి పీఎస్ శ్రీధర్,49 బన్నూరులో రమణారెడ్డి, సోఫీసాహెబ్,సాంబశివుడు పీఎస్ వినయ్ చంద్ర, చౌటుకూరులో నరసింహ గౌడ్ షబ్బు,బైరాపురంలో రఘురామయ్య,చాకర్ వలి, పీరు సాహెబ్ పేటలో మహేశ్వర్ రెడ్డి,వెంకటేశ్వర రెడ్డి,దేవనూరులో మాజీ సర్పంచ్ నాగేంద్ర వివిధ గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు మరియు సిబ్బంది కలిసి పింఛన్లను పంపిణీ చేశారు.

