స్వామిత్వా రీ సర్వే పై గ్రామసభ …
1 min read

చెన్నూరు ,న్యూస్ నేడు : చెన్నూరు మండలము, రామనపల్లి గ్రామ పంచాయతి నందు నిన్నటి దినము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రతిష్టాత్మకముగా గ్రామ సచివాలయ ఉద్యోగులతో ప్రారంబించిన స్వామిత్వ కార్యక్రమమునకు సంబంధించి గ్రామ సభ నిర్వహించినారు. ఈ కార్యక్రమనునకు చెన్నూరు మండల డిప్యూటీ ఎం.పి.డి.ఓ గంగనపల్లి సురేష్ బాబు , రామనపల్లి పంచాయతి కార్యదర్శి మేడా గురువేశ్వర రావు , మరియు సచివాలయ సిబ్బంది తో పాటు రామనపల్లి ప్రజలు ఈ కార్యక్రమమునకు హాజరయ్యారు . ఈ కార్యక్రమును ఉద్దేశించి డిప్యూటీ ఎం.పి.డి.ఓ సురేష్ బాబు గారు మాట్లాడుతూ గ్రామ కంటం క్రింద అనుభవ ఆధీనములో ఉన్న ఇళ్ళు మరియు ఇంటి స్థలములకు చట్ట పరమైన యజమానులను నిర్దారించటముతో పాటు వారికి యాజమాన్యపు ద్రువపత్రముతో పాటు చట్ట భద్రత కలిపించే ముఖ్య ఉద్దేశముతో ప్రభుత్వము స్వామిత్వ కార్యక్రమమును మొదలు పెట్టినారని, ఈ కార్యక్రమము ను ప్రజలు పూర్తి స్టాయిలో సద్వినియోగము చేసుకోవాలనియు, ప్రజలు స్వామిత్వ కార్యక్రమములో ఉద్యోగులకు పూర్తి స్థాయిలో సహకరించాలని కోరారు. ప్రజలకు ఏమైనా ఈ స్వామిత్వ సర్వే నందు సమస్యలు ఉన్నట్లయితే అర్జీ రూపములో తెలియజేయాలనియు , వంశపారంపర్యముగా సంక్రమించే ఆస్తులపైన ఏమైనా భాగపరిష్కార సమస్యలు ఉన్నట్లయితే సామరస్య పూర్వకముగా పరిష్కారము చేయుటకు మా అధికారుల కు పూర్తి సహకారము అందించలి అని పిలుపు ఇచ్చారు . ఈ గ్రామ సభకు హాజరయిన మరియు ఈ స్వామిత్వ కార్యక్రమములో పాల్గొని సర్వే నిర్వహించే ఉద్యోగులకు ఏమైనా సాంకేతిక సమస్యలు ఉన్న యెడల వారికి మా పూర్తి సహకారము అందించ గలమని, స్వామిత్వ సర్వే చేయు సమయములో ఎటువంటి తప్పులు లేకుండా సర్వే చేయవలసినదిగా ఆదేశిస్తూ, ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే వెంకనే సామరస్యంగా పరిష్కరించల ప్రజల తో తీసుకురావాలని సర్వేలో పాల్గొనే ఉద్యోగులకు తెలిపారు. ఈ స్వామిత్వ గ్రామ సభకు హాజరయిన ప్రజలకు, ఉద్యోగులకు అభినందలు తెలుపుతూ కార్యక్రమమును ముగించడము జరిగినది.

