PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నారప్ప చించేశాడప్పా..

1 min read

సినిమా డెస్క్​ : వెంకటేష్ , శ్రీకాంత్‌ అడ్డాల కాంబోలో తెరకెక్కిన మూవీ ‘నారప్ప’. తమిళంలో బ్లాక్ బస్టర్ అయిన ధనుష్ సినిమా ‘అసురన్’కి ఇది రీమేక్. ఈ నెల 20న అమెజాన్‌ ప్రైమ్‌ ద్వారా మూవీ విడుదలవుతోంది. నిన్న ట్రైలర్‌‌ని విడుదల చేశారు. ఇప్పటికీ కొన్ని మారుమూల గ్రామాల్లో కొనసాగుతున్న భూస్వామ్య, కుల వ్యవస్ఠల గురించి, వాటివల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి తీసిన సినిమా ఇది. ‘మన దగ్గర భూమి ఉంటే తీసేసుకుంటారు, డబ్బు ఉంటే లాగేసుకుంటారు. . కానీ చదువు ఒక్కటే.. మన దగ్గర నుంచి ఎవరూ తీసుకోలేరు’ అంటూ వెంక‌టేష్ చెప్పిన ఎమోషన్‌ డైలాగ్‌తో పాటు యాక్షన్ సీక్వెన్సులు కూడా ట్రైలర్‌‌లో హైలైట్ అయ్యాయి. హీరోయిన్‌ ప్రియమణి నటన అల్టిమేట్‌ అనిపించేలా ఉంది. ఈ మూవీని శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో సురేష్ బాబు, కలైపులి ఎస్ థాను కలిసి నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించారు. కార్తీక్‌ రత్నం, రావు రమేష్, రాజీవ్ కనకాల, నాజర్, ఆడుకాలం నరేన్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు.

About Author