NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రజాస్వామ్యం పై మాట్లాడే హక్కు వైసిపి నాయకులకు లేదు…

1 min read

30 ఏళ్ల తర్వాత పులివెందులలో ప్రజాస్వామ్యం…..

స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకున్న పులివెందుల ప్రజలు….

తెదేపా మండల కన్వీనర్ వీరన్న గౌడ్..

హొళగుంద న్యూస్ నేడు : ప్రజాస్వామ్యం పై మాట్లాడే హక్కు వైసిపి నాయకులకు లేదని తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ వీరన్న గౌడ్ అన్నారు.ఈ  సందర్భంగా బుధవారం నాడు కూటమి నాయకులు ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 30 ఏళ్ల తర్వాత పులివెందులలో ప్రజాస్వామ్యం విరసిల్లిందని, పులివెందుల ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకున్నారని అన్నారు.వైసిపి నాయకులు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం దయ్యాలు వల్లే వేసినట్లు ఉందని ఎద్దేవ చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో స్థానిక ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి వెళ్లిన తెదేపా, జనసేన నాయకులపై వైసిపి నాయకులు విచక్షణ రహితంగా దాడి చేసి నామినేషన్ పత్రాలను లాక్కున్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎంపీటీసీ జడ్పిటిసి స్థానాల్లో వైఎస్ఆర్సిపి పార్టీ వారినే తప్ప ఇతర పార్టీ వారిని నామినేషన్ కూడా వేయకుండా దౌర్జన్యానికి దిగారని గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వ అధికారంలో  పులివెందులలో ఎన్నడూ లేని విధంగా ప్రజాస్వామ్యబద్ధంగా 11 నామినేషన్లు దాఖలయ్యాయని, నామినేషన్ ల నుండి ఓటింగ్ వరకు అన్నింట్లో నిబంధనలు అమలయ్యాయని 75% ఓటింగ్ జరిగిందని అన్నారు. గ్రామస్థాయి నేతలకు లక్ష నుంచి 20 లక్షల వరకు వైసిపి నాయకులు పంపారని విమర్శించారు. అయినా కాలం కలిసి రాక వైసిపి ఓటర్లు మొహం చాటేశారని ఎద్దేవ చేశారు. ప్రజలు వాస్తవాలు గ్రహిస్తున్నారని వైసిపి ఎన్ని దుష్ప్రచారాలు చేసిన వైసీపీ పార్టీ నాయకులను నమ్మే పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు లేరని అన్నారు.రాష్ట్ర ప్రజలు 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి పార్టీని 11 స్థానాలకే పరిమితం చేసిన కూడా వైసీపీ తప్పుడు ప్రచారాలతో ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారని, కానీ రాష్ట్ర ప్రజలు నమ్మేస్థితిలో లేరని అన్నారు.ఈ కార్యక్రమంలో జనసేన కన్వీనర్ అశోక్, బిజెపి నాయకులు ప్రసాద్, తెదేపా సీనియర్ నాయకులు ఎర్రిస్వామి,పంపాపతి, దిడ్డి వెంకటేష్, అబ్దుల్ సుభాన్, సిబిఎన్ ఆర్మీ మోయిన్, జమాపుర బసవ, సలీం, రామాంజిని,రారావి సిద్దు,పీరన్న,పుట్టప్ప,తిక్క స్వామి,ఉలిగన్న కూటమి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author