రాఘవేంద్రుని సన్నిధి లో వైకాపా జిల్లా ఉపాధ్యక్షులు ప్రదీప్ రెడ్డి దంపతులు
1 min read

మంత్రాలయం , న్యూస్ నేడు : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి సప్త ఆరాధనోత్సవాలలో భాగంగా ఆరవ రోజు బుధవారం వైకాపా జిల్లా ఉపాధ్యక్షులు ప్రదీప్ రెడ్డి సతీమణి తో రాఘవేంద్ర స్వామి ని దర్శించుకునేందుకు వచ్చారు. వీరికి మఠం అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. వీరు ముందుగా గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళ హారతి ఇచ్చారు. అనంతరం రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. వీరి కి శ్రీమఠం పీఠాధిపతులు శ్రీ సుభుధేంద్ర తీర్థులు శేష వస్త్రం కప్పి ఫలమంత్రాక్శితలు ఇచ్చి ఆశీర్వదించారు. వీరి వెంట సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య, మఠం అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహ స్వామి, శ్రీ కాంత్ రెడ్డి, చాకలి రాము, ప్రదీప్ రెడ్డి పిఏ రవి కుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు.

