కృష్ణాష్టమి రోజున గోపూజా కార్యక్రమాలు
1 min read

డాక్టర్ మల్లు వేంకట రెడ్డి, తితిదే.
కర్నూలు, న్యూస్ నేడు: ఈ నెల 16న శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో నాలుగు కేంద్రాలలో గోపూజ కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి తెలిపారు. నంద్యాల పట్టణం పద్మావతి నగర్ లోని శ్రీకృష్ణ మందిరం మరియు కోవెలకుంట్ల మండలం రేవనూరు గ్రామంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానంనందు, కల్లూరు మండలం, పెద్దటేకూరులోని శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి దేవస్థానము మరియు గోశాల నందు, ఆదోని మండలం సలకలకొండ నందు ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు, ఇందుకు సంబంధించిన బ్యానర్లను స్థానిక ఆలయ కమిటీ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ మందిర నిర్వాహకులు విజయ చంద్రుడు, ధర్మ ప్రచారకులు జయదేవానందస్వామి తదితరులు పాల్గొన్నారు.

