జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ కి ఏపీ బిసి జె.ఎ.సి వినతి
1 min read

ఏలూరు, న్యూస్ నేడు: ఏపీ బిసి కులాల జె.ఎ.సి సంఘం ప్రతినిధులు బుధవారం జిల్లా పరిషత్ క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ కి వినతి పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటికే భారతరత్న డా: బి.ఆర్.అంబేద్కర్, టంగుటూరి ప్రకాశం పంతులు, పొట్టి శ్రీరాములు,అల్లూరి సీతారామరాజు,ఎన్టీఆర్, వై.ఎస్.ఆర్.పేర్లతో జిల్లాలు స్థిరపరచబడ్డాయని గుర్తు చేశారు. రాష్ట్రంలో రెండున్నర కోట్ల మంది బిసి ల ఆత్మగౌరవానికి ప్రతీకగా, బిసి చైతన్యానికి మార్గదర్శకుడిగా నిలిచిన సర్దార్ గౌతు లచ్చన్న పేరు ఆయన జన్మస్థలమైన శ్రీకాకుళం జిల్లాకు ఇవ్వాలని, దానిని “సర్దార్ గౌతు లచ్చన్న శ్రీకాకుళం జిల్లా”గా నామకరణం చేయాలని సంఘం తరఫున అభ్యర్థించారు.ఈ కార్యక్రమంలో ఏపీ బిసి కులాల జె.ఎ.సి సంఘం అధ్యక్షులు డా:లంకా వెంకటేశ్వర్లు,ఏపీ బిసి ఓబీసీ ఎంప్లాయిస్ కమిటీ చైర్మన్ ఎస్.వి.ఆర్.విఠల్ కుమార్, లక్కోజు గోపాలచారి, ఉక్కుసూరి గోపాలకృష్ణ,జిల్లా ఏపీ బిసి ఓబీసీ ఎంప్లాయిస్ కమిటీ చైర్మన్ పామర్తి యేసురాజు, ముదుగురు సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

