వైఎస్ తెలంగాణకు వ్యతిరేకం కాదు !
1 min readపల్లెవెలుగు వెబ్ : వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు లేవని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. రాజన్న రాజ్యం తీసుకొచ్చేందుకే పార్టీ పెట్టానని తెలిపారు. లోటస్ పాండ్ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. వైఎస్ తెలంగాణ వ్యతిరేకి కాదని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని యూపీఏ మేనిఫెస్టోలో చేర్చింది ఆయనేనని తెలిపారు. రాష్ట్ర ప్రజలు వైఎస్ ను గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారని అన్నారు. వైఎస్ మరణంతోనే తెలంగాణ మలిదశ ఉద్యమం మొదలైందని అన్నారు.