ఇంజనీరింగ్ విద్యార్థికి సంపూర్ణ నైపుణ్యం అవసరం
1 min read

ఆమ్ డాక్స్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఈ. ఎస్. చక్రవర్తి
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు నగరంలోని అటానమస్ కళాశాలలు జి. పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాల,మరియు రవీంద్ర మహిళా ఇంజనీరింగ్ కళాశాలలు సంయుక్తంగా నిర్వహించిన ప్రథమ బి.టెక్, ఎంబిఏ ఓరియంటేషన్ ప్రోగ్రాం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎన్నో వేల మందికి స్పూర్తి ప్రధాతఅయిన ఆమ్ డాక్స్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఇ.ఎస్.చక్రవర్తి విచ్చేశారు. వీరు విద్యార్థులతో మాట్లాడుతూ రాష్ట్రంలోనే అత్యుత్తమ కళాశాలలైన జి. పుల్లయ్య మరియు రవీంద్ర ఇంజనీరింగ్ కళాశాలలో అడ్మిషన్ పొందిన విద్యార్థులను అభినందించారు. ఇంజనీరింగ్ విద్యలోని అన్ని బ్రాంచీల విలీనము సరికొత్త ఆవిష్కరణలకు తెరదీస్తుందన్నారు. ఇంజనీరింగ్ విద్యలో కళాశాల యాజమాన్యములతోపాటు తల్లిదండ్రులుకూడా ముఖ్య భూమిక పోషించాలన్నారు. సమస్య పురాణం నైపుణ్యాన్ని పెంచుకోవాలన్నారు. గణిత శాస్త్రంతో పాటు గ్లోబల్ లాంగ్వేజ్ అయిన ఆంగ్ల భాష పై పట్టు సాధించి భావవ్యక్తీకరణ నైపుణ్యాలను పదును పెట్టాలని తెలిపారు. విద్యార్థులతోపాటు తల్లిదండ్రులకు,కళాశాల యాజమాన్యానికి కొన్ని బాధ్యతలను గుర్తు చేశారు. కళాశాల వ్యవస్థాపకులు జి. పుల్లయ్య మాట్లాడుతూ మా కళాశాలలపై అపారమైన నమ్మకంతో ఇక్కడ చేరిన ప్రతి విద్యార్థికి శుభాకాంక్షలు తెలుపుతూ తల్లితండ్రులకు ధన్యవాదములు తెలియజేశారు.విద్యార్థులు తలచుకుంటే ఆకాశమే హద్దుగా చెలరేగి అసాధ్యాలను సైతం నైపుణ్యంతో ఛేదించగలరన్నారు.సాంకేతిక పరిజ్ఞానంతో అనుక్షిపను ప్రయోగించి వినాశనానికి కారణమవుతున్న మేధస్సును ఉపయోగించి సామాన్య ప్రజానీకానికి చేరువయ్యే విప్లవాత్మక మార్పులు తీసుకురావాలన్నారు. అనంతరం కళాశాలల ఛైర్మన్ జి.వి.ఎం మోహన్ కుమార్ గారు మాట్లాడుతూ నేడు చదువుతోపాటు సంస్కారం కూడా నేర్పించవలసిన గురుతర బాధ్యత మాపై ఉందన్నారు.ఏ విద్యార్థి అయితే చదువుతోపాటు పరిశోధనలపై దృష్టి సాగిస్తారో వారు కార్పోరేట్ కంపెనీల దృష్టిని ఆకర్షిస్తారన్నారు. మనము కంపెనీలను వెతుక్కుంటూ పోవడం కాదు,మనలను వెతుకుతూ కంపెనీలు రావాలి.ఇది కదా నిజమైన విద్యార్థి మేధస్సు అంటే. కావున మీరు మీ భావి జీవితానికి నేటి నుండే పునాదులు వేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఈవోలు జి.గోపీనాథ్, జి. వంశీధర్ ప్రిన్సిపాల్లు సి.శ్రీనివాసరావు, డాక్టర్ కే. ఈ శ్రీనివాసమూర్తి వివిధ విభాగాధిపతులు పాల్గొన్నారు.


