ఆదిత్య కళాశాల, మానవతసంస్థలు ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం
1 min read

పాల్గొన్న కళాశాల ప్రిన్సిపల్ వంగా వెంకటేశ్వరరావు
మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు
ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఏలూరు సత్రంపాడు లోని ఆదిత్య డిగ్రీ కళాశాల మరియు మానవత సంస్థల ఆధ్వర్యంలో కట్టా సుబ్బారావు తోట. శ్రీరామ్ నగర్ లో స్వచ్ఛ భారత్ కార్యక్రమము మరియు విశ్వ బంధుత్వ దినోత్సవము సందర్భంగా బ్రహ్మ కుమారిస్ సమాజ సేవ విభాగం ఆధ్వర్యంలో మెగా రక్తదాన కార్యక్రమము నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ వంగా వెంకటేశ్వర రావు, ఎన్ ఎస్ ఎస్ ఆఫీసర్ కె. హరిబాబు మరియు రెడ్ క్రాస్ సభ్యులు, అలా నాగేశ్వర రావు, మానవత సంస్థ సభ్యులు, ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.


