జలదుర్గం గ్రామానికి పశువుల డాక్టర్ ను నియమించాలి
1 min read

ప్యాపిలి, న్యూస్ నేడు: ప్యాపిలి మండలంలోని జలదుర్గం గ్రామములో పశువుల డాక్టర్ ని నియమించాలని మండల కో ఆప్షన్ మెంబర్ రసూల్,సిఐటియు మండల కార్యదర్శి నేసే శ్రీనివాసులు, కాంగ్రెస్ నాయకులు చికెం నాగరాజు, ఖాజా బాషా, మొద్దులు హుస్సేన్ వలి ఇంచార్జ్ ఎంపిడివో వెంకటేశ్వర్లు కి వినతి పత్రం అందజేశారు. గ్రామములో 10 వేల పైగా గొర్రెలు, మేకలు, 150 ఆవులు, 250 బర్రెలు, 150 ఎద్దులు ఉన్నాయని, డాక్టర్ బదిలీ కావడంతో, రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారని, కనీసం వెటర్నరీ అసిస్టెంట్ కూడా లేకపోవడంతో రైతులు నానా అవస్థలు పడుతున్నారని, ఇ ప్పటికైనా అధికారులు స్పందించి వెటర్నరీ డాక్టర్ ను నియమించవలసినదిగా కోరారు.

