ఘనంగా తెలుగు భాషా దినోత్సవం
1 min read

ప్యాపిలి, న్యూస్ నేడు: ప్యాపిలి పట్టణంలోని క్రింది గేరి లోని మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. గిడుగు వెంకట రామమూర్తి జన్మదినం సందర్భంగా శుక్రవారం ప్రధానోపాధ్యాయులు మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటామని మరియు తెలుగు భాషకు ఆయన చేసిన విశేష కృషిని విద్యార్థులందరికీ వివరించారు. ఈకార్యక్రమంలో ఉపాధ్యాయులు హరినాథ్ రెడ్డి, లక్ష్మి మరియు గురువర్ధిని మరియు విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.


