దెందులూరు నియోజకవర్గంలో రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీకి రంగం సిద్ధం
1 min read

అర్హులైన ఏ ఒక్కరికి ఫించన్ తొలగించబడదు
దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వెల్లడి
కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అండగా ఉంటుంది
డప్పు కళాకారులకు తీన్మార్ డబ్బులు అందజేత
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : దొంగ సర్టిఫికెట్లతో వైసీపీ నాయకులు చేసిన ఫించన్ల దోపిడిల పాపం, నేడు ఎంతో మంది దివ్యాంగులకు శాపంగా మారింది. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వెల్లడిo చారు.దుగ్గిరాల లోని క్యాంపు కార్యాలయంలో దెందులూరు చింతమనేని ప్రభాకర్ మాతృమూర్తి స్వర్గీయ చింతమనేని వెంకటసుబ్బమ్మ వర్ధంతి సందర్భంగా తన మాతృమూర్తి చిత్రపటానికి పూలమాల నివాళులు అర్పించారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో వచ్చిన వినతిలో భాగంగా ఏలూరు రూరల్ మండలం చాటపర్రు, తిమ్మారావు గూడెం లోని డప్పు కళాకారులకు జీవనోపాధికి అండగా ఉంటూ తీన్మార్ డబ్బులను అందజేశారు. దుగ్గిరాల లోని క్యాంపు కార్యాలయంలో శనివారం ఉదయం దెందులూరు ఎమ్మెల్యే ని పలువురు అధికారులు, నియోజకవర్గ కూటమి నాయకులు, ప్రజలు మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చాలను అందించి శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా పలు ఆహ్వాన పత్రికలను అందజేశారు.పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సత్వరమే వాటిని పరిష్కరించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే ప్రభాకర్ మాట్లాడుతూ “రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రేషన్ పంపిణీ విధానంలో కొత్తగా చేపట్టిన స్మార్ట్ కార్డుల పంపిణీ ప్రక్రియను దెందులూరు నియోజకవర్గంలో త్వరలో చేపట్టడానికి రంగం సిద్ధం చేశామని తెలిపారు. త్వరలోనే దెందులూరు నియోజకవర్గంలోని అర్హులైన పేదలకు సొంత ఇంటికాలను సహకారం చేసే విధంగా ఉచితంగా ఇంటి స్థలాలను కూడా మంజూరు చేయడానికి చర్యలు చేపట్టామని నియోజకవర్గంలోని ప్రతి పేద కుటుంబానికి కూడా తాను ప్రభుత్వ పరంగాను, వ్యక్తి గతంగాను అన్ని విధాల ఎల్లప్పుడు అండగా ఉంటానని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు.


