వినాయక లడ్డును దక్కించుకున్న బూషిగౌడ్..
1 min read

నందికొట్కూరు, న్యూస్ నేడు: నంద్యాల జిల్లా పగిడ్యాల మండలంలోని వివిధ గ్రామాల్లో వెలసిన వినాయకున్ని గత నాలుగు రోజుల నుండి ప్రజలు మహిళలు ప్రత్యేక పూజలు చేశారు.చివరి రోజున శనివారం జై జై గణేశా అంటూ ఒకరినొకరు సంతోషంగా రంగులు డాన్స్ లతో బైబై గణేశా అంటూ వినాయకుని నిమజ్జనం చేశారు.లక్ష్మాపురంలో వినాయకుని లడ్డూ వేలం పాటలో గ్రామ టీడీపీ నాయకులు ఎన్.భూషి గౌడ్ 13 వేలకు దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో అరవింద గౌడ్,రామసుబ్బయ్య, రాఘవేంద్ర గౌడ్,చరణ్ గౌడ్, సంజీవ గౌడు,వంశీ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

