వాటర్ ప్లాంట్లను ప్రారంభించిన ఎంపీ శబరి..
1 min read

డ్రైనేజీ,సీసీ రోడ్లు ఏర్పాటు చేయాలని మహిళల మొర
గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు..
మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్ నేడు : నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం పడమర ప్రతకోట గ్రామంలో మరియు మిడుతూరు మండలం కడుమూరు గ్రామంలో ఎంపీ నిధులు 5 లక్షలతో నిర్మించిన మినరల్ వాటర్ ప్లాంట్లను నంద్యాల ఎంపీ మరియు పార్లమెంట్ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి సోమవారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.కడుమూరులో సర్పంచ్ ఎస్ జీవరత్నం,రామ సుబ్బా రెడ్డి ఎంపీకి ఘన స్వాగతం పలికారు.ఎంపీ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు.తర్వాత మా కాలనీలో డ్రైనేజీ మరియు సీసీ రోడ్లు లేకపోవడం వల్ల మురుగునీరు రోడ్ల మీదే పారుతూ ఉందని మైనార్టీ మహిళలు ఎంపీతో మొర పెట్టుకోవడంతో వెంటనే స్పందించిన నా నిధుల నుండి 15 లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.మైనార్టీ కాలనీని ఎంపీ పరిశీలించారు. తర్వాత ఉర్దూ పాఠశాలను తనిఖీ చేయగా అక్కడ ఉన్న ఉపాధ్యాయులను కొందరిని డిప్యూటేషన్ పై ఇతర పాఠశాలలకు బదిలీపై వెళ్లారని హెచ్ఎం వివరణ ఇవ్వడంతో ఎంపీ జిల్లా మైనార్టీ అధికారికి ఫోన్ చేసి డిప్యూటేషన్ పై ఉన్న టీచర్లను పాఠశాలకు పంపాలని ఆదేశించారు.ఆరోగ్య కేంద్రం శిథిలావస్థలలో ఉందని ఆశా కార్యకర్తలు ఎంపీకి చెప్పడంతో ఎంపీ ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. కాకరవాడ చిన్న వెంకటస్వామి,కట్టుబడి శ్రీనివాసులు,ఎంపీడీవో దశరథ రామయ్య,తహసిల్దార్ శ్రీనివాసులు,జూపాడు బంగ్లా ఎస్సై మల్లికార్జున,సీతారామిరెడ్డి,భగీరథ రెడ్డి,సత్యం రెడ్డి, నాగేశ్వరరావు,తువ్వా అయ్యపు రెడ్డి,నవాజ్ అలీ,మహేష్ పాల్గొన్నారు.

