NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏలూరులో పండుగ వాతావరణం లో పింఛన్లు పంపిణీ కార్యక్రమం

1 min read

కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అన్ని విదాలుగా అండగా ఉంటుంది

ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బడేటి చంటి, మేయర్ నూర్జహాన్, ఆర్టీసీ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు  : ప్రతినెలా 1వ తేదీ నాటికే ఠంచన్‌గా సామాజిక పెన్షన్లు అందిస్తోన్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతోందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. ఏలూరు 33వ డివిజన్‌ చిట్టివలస పాకల ప్రాంతంలో సోమవారం సెప్టెంబర్‌ నెలకు సంబంధించిన ఎన్టీఆర్‌ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా పాల్గొన్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, ఏపిఎస్‌ ఆర్టీసి విజయవాడ జోన్‌ – 2 ఛైర్మన్‌ రెడ్డి అప్పలనాయుడు, నగర మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌ పెదబాబులు తొలుత మాజీ ముఖ్యమంత్రి, దివంగత ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్వయంగా లబ్దిదారుల ఇళ్ళకు వెళ్ళీ పెన్షన్‌ సొమ్ములను అందజేశారు. వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.కార్యక్రమంలో 33వ డివిజన్ ఇంచార్జ్ పిల్లారిశెట్టి సంధ్య సురేష్, డివిజన్ కార్పొరేటర్ కత్తిరి రామ్మోహన్రావు, మాజీ కార్పొరేటర్లు చింతలపూడి సత్యనారాయణ, కరణం లోకేష్, క్లస్టర్ ఇంచార్జ్ ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు, కో-క్లస్టర్  రాజేశ్వర రావు, డివిజన్ ప్రెసిడెంట్ కప్ప దుర్గాప్రసాద్,ఏపి మాలల ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ దాసరి ఆంజనేయులు, ఈడా ఛైర్మన్‌ పెద్దిబోయిన శివప్రసాద్‌, ఎఎంసి ఛైర్మన్‌ మామిళ్ళపల్లి పార్థసారధి, కార్పొరేషన్‌ కమిషనర్‌ ఎ. భానుప్రతాప్‌, కో-ఆప్షన్‌ సభ్యులు చోడే వెంకటరత్నం, ఎస్సెమ్మార్‌ పెదబాబు,టిడిపి నగర కార్యదర్శి రెడ్డి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

About Author