స్వచ్ఛ భారత్ .. జల జీవన్ మిషన్ అమలు నిర్వహణపై సమీక్ష
1 min read

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : స్వచ్ఛ భారత్ మిషన్ & జల జీవన్ మిషన్ అమలు, నిర్వహణపై బుధవారం ఢిల్లీ నుంచి డిపార్ట్మెంటు ఆఫ్ డ్రింకింగు వాటరు అండ్ శానిటేషన్ (డిడిడబ్ల్యు ఎస్) సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 16 జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమీక్ష సమావేశానికి జిల్లా కలెక్టరు క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి, గ్రామీణ నీటి సరఫరాశాఖ ఎస్ఈ, తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి జల జీవన్ మిషన్, స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా జిల్లాలో జరుగుతున్న పనులకు సంబందించి (డిడిడబ్ల్యూ ఎస్) సెక్రటరీ కి వివరించారు.జిల్లాలో 4,79,752 ఇళ్ళకు గాను ఆగస్టు 2019 నాటికి 2,56,892 ఇళ్ళకు మంచినీటి కనెక్షన్లు ఇవ్వగా, జలజీవన్ మిషన్ (జె జె ఎం) నందు 1,60,006 ఇళ్లకు మంచినీటి కనెక్షన్లు ఇవ్వడం జరిగిందన్నారు.మరో 62,854 ఇళ్ళకు మంచినీటి కనెక్షన్లు ఇచ్చేందుకు చర్యలు చేపట్టడం జరుగుచున్నదన్నారు.జిల్లాలో 603 గ్రామములకు గాను 306 గ్రామములు హర్ ఘర్ జల్ (హెచ్ జి జె) గ్రామములుగా ధ్రువీకరిచబడ మైనదన్నారు. జిల్లాలో 4 ల్యాబ్ లకు గాను 3 ల్యాబ్లు, ఎన్ఏబిఎల్ అక్రిడిటేషన్ అయివున్నాయి. జిల్లాలో 45 ప్రత్యేక గిరిజన గ్రామములో (PM JANMAN- PVTG) 2848 ఇళ్ళకు గాను 2396 ఇళ్ళకు మంచినీటి కుళాయి కనెక్షన్లు ఇవ్వడం జరిగిందన్నారు. మరో 452 కనెక్షన్లు డిసెంబర్ 2025 నాటికి పూర్తి చేయుటకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.అన్ని నీటి వనరులను ఫీల్డ్ యూసర్ యాప్ ద్వారా జియోటాగ్ చేయించి, ఫిజికల్ పురోగతిని ఎప్పటికప్పుడు ఐఎంఐఎస్ లో పొందుపరచాలన్నారు.ఈ సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ఈ జి.త్రినాథ బాబు, తదితరులు పాల్గొన్నారు.

