NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వదిన మర్డర్ కేసులో మరిది అరెస్ట్..రిమాండ్

1 min read

వివరాలు వెల్లడించిన సీఐ సుబ్రహ్మణ్యం..

నందికొట్కూరు, న్యూస్ నేడు:  వదినను చంపిన కేసులో మరిదిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు నందికొట్కూరు రూరల్ సీఐ టి సుబ్రహ్మణ్యం తెలిపారు.శనివారం సాయంత్రం రూరల్ సీఐ తెలిపిన వివరాల మేరకు పగి డ్యాల మండల పరిధిలోని ఎం. ఘణపురం గ్రామానికి చెందిన సుగాలి నాగమ్మ గత కొన్ని రోజుల నుండి రైతుపల్లె గ్రామానికి చెందిన వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పరచుకొని అతను ఇంటికి వచ్చి వెళ్తూ ఉండేవాడు. గ్రామంలో తమ కుటుంబ పరువు తీస్తుందని తన ప్రవర్తనను మార్చుకోవాలని ఎన్నిసార్లు ఆమెకు చెప్పినా ప్రవర్తనను మార్చుకోక పోవడంతో మృతురాలికి మరిది అయిన సుగాలి లోక నాయక్ ఎలాగైనా వదినను చంపి కుటుంబ పరువును కాపాడాలనే ఉద్దేశ్యంతో  ఈనెల 4వ తేదీ ఉ 7:30 సమయంలో లోక నాయక్ తమ ఇంటి నుండి రాడ్ తీసుకొని వదిన ఇంటికి వెళ్లి వదినతో గొడవపడి ఆమె తలపై రాడ్డుతో కొట్టగా తలకు బలమైన కావడంతో ఇంటి ముందే ఉన్న నీటి పైపు మీద బోర్లా పడి అక్కడికక్కడే మృతి చెందింది.సుగాలి చంద్ర నాయక్ ఫిర్యాదు మేరకు ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్ లో లోక నాయక్ పై కేసు నమోదు చేశారు.ఆ తర్వాత తప్పించుకుని తిరుగుతున్న లోక నాయక్ ను శనివారం సాయంత్రం ఈస్ట్ ప్రాతకోట గ్రామంలో కాటమయ్య గుడి దగ్గర అరెస్టు చేసి హత్యకు వాడిన రాడ్డును స్వాధీనం చేసుకుని అతనిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు సీఐ సుబ్రహ్మణ్యం తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ శేషయ్య,సిబ్బంది చాంద్ బాష, రఫీ,నాగమల్లయ్య పాల్గొన్నారు.

About Author