NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నందికొట్కూరులో యూరియా పంపిణీ..

1 min read

ఏడీఏ గిరీష్..ఎంఏఓ షేక్షావలి

నందికొట్కూరు, న్యూస్​ నేడు:  నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలానికి 71.82 టన్నుల యూరియా వచ్చినట్లు వీటిని మండలంలోని వివిధ గ్రామాల రైతులకు యూరియాను శనివారం అధికారుల ఆధ్వర్యంలో రైతులకు యూరియాను పంపిణీ చేసినట్లు నందికొట్కూరు వ్యవసాయ సహాయ సంచాలకులు ఎం.గిరీష్ మరియు మండల వ్యవసాయ అధికారి షేక్షావలి తెలిపారు. గ్రామాల వారీగా వచ్చిన యూరియాదామగట్లకు 11.97 మెట్రిక్ టన్నులు,వడ్డెమాను గ్రామానికి 11.97 మెట్రిక్ టన్నులు, మల్యాల గ్రామానికి 11.97 మెట్రిక్ టన్నులు,10 బొల్లవరం గ్రామంలో 11.97టన్నులు, బిజినవేముల గ్రామానికి 11.97 టన్నులు,కొణిదెల గ్రామానికి 11.97 టన్నుల యూరియా వచ్చిందని వీటిని వ్యవసాయ అధికారులు మరియు నందికొట్కూరు తహసిల్దార్ శ్రీనివాసులు, బ్రాహ్మణకొట్కూరు ఎస్సై పి తిరుపాల్ మరియు వ్యవసాయ అధికారుల సమక్షంలో రైతులకు యూరియాను పంపిణీ చేసినట్లు ఏడిఏ మరియు ఎంఏఓ శనివారం సాయంత్రం తెలిపారు.మండలానికి మొత్తం 71.92 మెట్రిక్ టన్నులు యూరియా వచ్చినది.ఇందులో 57.195 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేయడం జరిగినది. ఇంకా 14. 625 టన్నుల యూరియా మల్యాల 7.47 టన్నులు, దామగట్ల 4.5 టన్నులు బొల్లవరం 2.655 టన్నులు గ్రామాల్లో అందుబాటులో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సిబ్బంది,వీఆర్వోలు పోలీసులు పాల్గొన్నారు.

About Author