శ్రీ మఠంలో అనంత చతుర్దశి
1 min read

మంత్రాలయం న్యూస్ నేడు : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో అనంత చతుర్దశి వేడుకలు ఘనంగా జరిగాయి. శనివారం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో, అనంత చతుర్దశి సందర్భంగా స్వర్ణ మంటపంలో శ్రీ అనంత పద్మనాభుని ప్రతిమను ఉంచి విశేష పూజలు చేశారు. అనంతరం శ్రీ మూల రామ, దిగ్విజయ రామ, జయరామ, సంతాన గోపాలకృష్ణ, నరసింహ స్వామి మూర్తులకు ప్రత్యేక అభిషేకాలు చేసి దూప దీప నైవేద్యాలు సమర్పించారు. అంతకు ముందు గ్రామ దేవత శ్రీ మంచాలమ్మకు విశేష పూజలు చేశారు. అనంతరం శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్నికి విశేష క్షీరాభి శేకం, పంచామృతాభిషేకం, ఫల పుష్పాలతో అభిషేకాలు నిర్వహించారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు ముందుగా శ్రీ మంచాలమ్మను దర్శించుకుని, శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించుకునేందుకు బారులు తీరారు. మఠం ప్రాకారంలో నిర్వహించిన పల్లకి సేవలో భక్తులు పాల్గొన్నారు.

