NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అర్జీదారులకు నాణ్యమైన పరిష్కారం చూపాలి

1 min read

పిజిఆర్ఎస్ లో అందిన అర్జీలు 324

జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు:   సంచార జాతుల వారి పిల్లలను విద్యకు దూరంచేయవద్దని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి వారి తల్లిదండ్రులకు హితవు పలికారు. ఏలూరు కలెక్టరేట్‌ గోదావరి సమావేశ మందిరంలో సోమవారం జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లాస్థాయి అధికారులతో నిర్వహించారు.   ఈ సందర్బంగా జిల్లా  కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి తో పాటు జాయింట్‌ కలెక్టర్‌ పి.ధాత్రిరెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ యం.ముక్కంటి,ఏలూరు ఆర్డిఓ యం. అచ్యుత అంబరీష్,స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దేవకిదేవి, అర్జీలు స్వీకరించారు. ఈసందర్బంగా వివిధ సమస్యల పరిష్కారానికి ప్రజల నుంచి 324 అర్జీలు అందాయి. ఈ సందర్భంగా సంచారజాతులకు చెందిన పలు కుటుంబాల పిల్లలకు ఆధార్ కల్పించాలని వారిని దత్తత తీసుకున్న వంగాయిగూడెం మున్సిపల్ ఎలిమెంట్రీపాఠశాల ప్రధానోపాధ్యాయులు వర్ధనపు శ్రీనివాసరావు జిల్లా కలెక్టర్ వారిని కలిసి సంచార జాతుల పిల్లలకు ఆధార్ కార్డులు జారీ చేయాలనీ కోరారు,దీనిపై జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి స్పందిస్తూ ఆ కుటుంబాల వారి సమస్యలను తెలుసుకుని వారికి అవసరమైన ఆదార్ కార్డులు జారీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

అందిన అర్జీలలో కొన్ని

శనివారపుపేటకు చెందిన పరసా వెంకటరత్నం అర్జీనిస్తూ తమ ప్రాంతంలో విద్యుత్ వైర్లు కిందకు వ్రేలాడుతూ పిల్లలకు అందేటట్లు ఉన్నాయని వాటిని సరిచేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.  చింతలపూడి మండలం ప్రగడవరంకు చెందిన ఎన్. నాగేశ్వరరావు అర్జీనిస్తూ తమ భూమి వివరాలు ఆన్ లైన్లో నమోదు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.  టి. నర్సాపురం మండలం బొర్రంపాలెంకు చెందిన్ ముంగర సాయిబాబా అర్జీనిస్తూ ఎర్రకాలువ ప్రాజెక్ట్ వద్ద తమ జీవనం సాగిస్తున్నామని, 2018లో సొసైటీలో తమకు సభ్యత్వం ఉన్నప్పటికీ 2024లో తమ పేరు తొలగించడం జరిగిందన్నారు. మాకు సభ్యత్వం కల్పిస్తూ కొత్త మత్స్యకార సొసైటీ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.  కలిదిండి మండలం కొండంగికి చెందిన కొల్లాటి వెంకటేశ్వరరావు అర్జీనిస్తూ తమ భూమికి పట్టాదారు పాస్ పుస్తకం , 1బి అడంగళ్ లో పేరు నమోదుకు చర్యలు తీసుకోవాలని కోరారు.  పెదవేగికి చెందిన బొల్లికొండ శ్రీనివాసరావు అర్జీనిస్తూ మండల కేంద్రంలో పిహెచ్ సికు దానంచేసిన భూమిని అక్రమంగా ఆక్రమించుకున్నవారిపై చర్యలు తీసుకొని ప్రభుత్వ భూమిని కాపాడాలని కోరారు.  కలిదిండి మండలం గురవాయిపాలెంకు చెందిన ఎస్. దామోదరరావు, తదితర రైతులు అర్జీనిస్తూ తమ భూములను సబ్ డివిజన్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.  ఈ కార్యక్రమంలో  వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేటు సిబ్బంది పాల్గొన్నారు.

About Author