వయో వృద్ధుల చట్టాలపై విస్త్రృత అవగాహన కల్పించాలి
1 min read

అక్టోబరు 1న ఘనంగా వృద్ధుల దినోత్సవం నిర్వహించాలి
వయో వృద్ధుల సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం అండగా నిలుస్తోంది
జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : వయో వృద్ధులను ఇబ్బందులకు గురిచేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి స్పష్టం చేశారు. బుధవారం స్ధానిక కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో వయో వృద్ధుల చట్టం 2007, 2011 నిబంధనల ప్రకారం జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా తల్లిదండ్రుల, వృద్ధుల పోషణ, మరియు సంక్షేమ చట్టం 2007,2011, సంక్షేమ నియమావళిపై ముద్రించిన అవగాహన కరదీపికను కమిటీ సభ్యులతో కలిసి జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆవిష్కరించారు. ఈ సమావేశానికి సంబంధిత అధికారులతోపాటు టెలీకాన్ఫిరెన్స్ ద్వారా సబ్-కలక్టర్, నూజివీడు రెవెన్యూ డివిజినల్ అధికారి, జంగారెడ్డిగూడెం వారు హాజరయ్యారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ వయో వృద్ధుల సంరక్షణకు ఉద్దేశించిన చట్టాలపై క్షేత్రస్ధాయిలో విస్త్రృత అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో వయో వృద్ధుల సంక్షేమంతోపాటు వారి సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం చేదోడు వాదోడుగా నిలుస్తుందని కలెక్టర్ వెట్రిసెల్వి భరోసానిచ్చారు. దీనిపై ప్రముఖులైన వయో వృద్ధుల అసోసియేషన్, వయో వృద్ధుల జిల్లా కమిటీ హర్షం వ్యక్తం చేశారు. వయో వృద్ధుల హక్కులను ప్రోత్సహించడం, వారిని రక్షించేందుకు లక్ష్యంగా చట్టాలు రూపొందించబడ్డాయన్నారు. ఘనంగా అక్టోబరు 1న వృద్ధుల దినోత్సవం. జిల్లాలో అక్టోబరు 1న వృద్ధుల దినోత్సవం పురస్కరించుకొని ఈనెల 21 నుండి 30వ తేదీ వరకు వివిధ పోటీలు, వైద్య శిబిరాలు, కుటుంబ సంబంధిత కార్యక్రమాలు తదితరాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి సంబంధిత అధికారులను ఆదేశించారు. డివిజన్ స్దాయిలో యూత్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ వారి సహకారంతో స్ధానిక కళాశాలల ప్రిన్సిపాల్స్, సీనియర్ సిటిజన్ల అసోషియేషన్ల సభ్యులతో ప్రతిజ్ఞ, వర్క్ షాప్ లు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో వృద్ధులతో కలిసి విద్యార్ధులకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ఈ సందర్బంగా వృద్ధుల తమ జీవిత విశేషాలను, విలువలను విద్యార్ధులకు తెలియజేసేలా చూడాలన్నారు. వృద్ధులకు ఆరోగ్య పరీక్షలుసమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు, ఎపి సీనియర్ సిటిజన్స్ వెల్పేర్ అసోషియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ వి. నారాయణమూర్తి, కార్యదర్శి కె.రామచంద్రరావు, సీనియర్ సిటిజన్స్ జిల్లా అధ్యక్షులు శివరామకృష్ణ, కమిటీ సభ్యులు వి. సత్యనారాయణ, ఎ.నిర్మల, ఏలూరు ఆర్డిఓ ఎం. అచ్యుత అంబరీష్, డిఎస్పీ శ్రావణ్ కుమార్, జిల్లా రిజిస్ట్రార్ కొమ్మినేని శ్రీనివాసరావు, డిఆర్డిఏ పిడి ఆర్. డా:విజయరాజు, జెడ్పి సిఇ ఎం.శ్రీహరి, డిసిహెచ్ఎస్ డా: పాల్ సతీష్ కుమార్,డిపివో కె.అనురాధ, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఎ.రామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


