NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విద్యుత్ స్తంభం నిన్న… నేడు

1 min read

మహానంది, న్యూస్​ నేడు:  నిన్న వీచిన గాలుల వల్ల నేల వాలిన విద్యుత్ స్తంభాన్ని నేడు  గుర్తించి వెంటనే విద్యుత్ శాఖ పునరుద్ధరించారు . మండలంలోని బొల్లవరం గ్రామంలోని కర్షకుల వరి పంట పొలాల్లో నిన్న నేల వాలిన ప్రధాన విద్యుత్ స్థంభం నేల వాలింది అని ప్రమాదం పొంచి ఉందని స్థానిక రైతులు విద్యుత్ శాఖ ఏఈ ప్రభాకర్ రెడ్డికి శుక్రవారం ఉదయం తెలియజేయడంతో అప్రమత్తమైన ఏ ఈ తమ సిబ్బందిని అప్రమత్తం చేశారు. వ్యవసాయ అవసరాల కోసం సరఫరా చేసే త్రీ పేజ్ విద్యుత్ సరఫరాలను నిలుపుదల చేసి వెంటనే విద్యుత్ స్తంభాన్ని యధా స్థానంలో ఏర్పాటుచేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విద్యుత్ సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతుల సహాయ సహకారాలతో సమాచారం అందించిన కొన్ని గంటల్లోనే స్థానిక విద్యుత్ శాఖ లైన్మెన్ భాస్కర్, అనిల్ విద్యుత్తు లైను పునరుద్ధరించి విద్యుత్ సరఫరాకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవడంతో స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేస్తూ ఏఈ తో పాటు విద్యుత్ శాఖ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.

About Author