జిల్లా పరిషత్ చైర్పర్సన్ ని కలిసిన పర్యవేక్షక ఇంజనీర్ రమేష్
1 min read

ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలి
జడ్పీ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీప్రసాద్
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : జిల్లా పరిషత్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ ప్రసాద్ ని నూతన పర్యవేక్షక ఇంజనీర్ రమేష్ తన క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ శుభాకాంక్షలు తెలియజేశారు. పంచాయతీరాజ్ విభాగం ద్వారా జిల్లాలో జరుగుతున్న అనేక అభివృద్ధి పనులపై సమగ్రంగా చర్చించారు. పనుల నాణ్యత,వేగం ప్రజలకు ఉపయోగకరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా అభివృద్ధిలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం కీలకపాత్ర పోషిస్తుందని, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని, సంబంధిత శాఖ అధికారులు సమన్వయం చేసుకుంటూ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని చైర్ పర్సన్ పద్మశ్రీ సూచించారు.

