NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించండి

1 min read

అధికారుల విధులు పట్ల సమయపాలన పాటించాలి

ఆస్పిరేషనల్ బ్లాక్ పై ప్రత్యేకమైన దృషి సారించాలి

ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్

హొళగుంద న్యూస్ నేడు :  అధికారుల విధులు పట్ల సమయపాలన పాటించాలని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పేర్కొన్నారు. శుక్రవారం హోళగుంద మండలం ఎంపీడీవో కార్యాలయంలో మండల కేంద్రం గ్రీవెన్స్ సందర్భంగా ప్రజా సమస్యల పరిష్కార వేదికపై ప్రజల నుండి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ… హోళగుంద మండల స్థాయి ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ లో వచ్చిన ప్రజల నుండి వచ్చిన అర్జీలను స్వీకరించారు. .మండలంలోని ఆయా శాఖల అధికారులకు సంబంధించిన సమస్యలను తెలియజేస్తూ గడువు లోపు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బియాండ్ ఎస్ ఎల్ ఏ లోకి వెళ్లకుండా చూడాలన్నారు. మెత్తం 35 అర్జీలు వచ్చాయని తెలిపారు. హోళగుంద మండలం పనిచేస్తున్న ఉద్యోగస్తులు, అధికారులు సమయపాలన పాటించడం లేదని తరచుగా వార్త పత్రికలలో వస్తున్నాయి. వీటిపై అధికారులు పద్ధతి మార్చుకోవాలని లేకపోతే శాఖ పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలని సూచించారు. మరి కొద్ది రోజుల్లో బన్ని ఉత్సవాలు సంబంధించిన ప్రక్రియ మొదలవుతుందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని, హెచ్చరించారు.   జిల్లాలో  ఆస్పిరేషనల్ బ్లాక్ మూడు మండలాలు ఎన్నిక కాగా రెండు పత్తికొండ డివిజన్ మరియు ఆదోని డివిజన్లో హోళగుంద ఏర్పాటు అయిన విషయం తెలిసిందే మొదటి ఫేస్ లో రెండు మండల కంటే తక్కువ స్థాయిలో ప్రతిభ కనబరిచారని రెండవ విడతలో అటువంటి సమస్యలు రాకుండా ఇచ్చిన సూచీకలలో వందశాతం ప్రతిభ కనబరచాలని సంబంధిత అధికారులకు సబ్ కలెక్టర్ ఆదేశించారు.   ఈ కార్యక్రమంలో డిఎల్పిఓ తిమ్మక్క, ఆర్ అండ్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పద్మనాభ రెడ్డి, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ వేణు సూర్య, ఇరిగేషన్ డిప్యూటీ ఇంజనీర్ షఫీ ఉల్లా, డిప్యూటీ డిఎంహెచ్వో సత్యవతి, డిప్యూటీ డీఈవో వెంకటరమణ రెడ్డి, తహశీల్దార్ నిజాముద్దీన్, ఎంపీడీవో విజయ లలిత సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

About Author