నిద్రలోనే యువకుడు అనంత లోకాలకు..
1 min read

మిడుతూరు, న్యూస్ నేడు : నిద్ర పోతూనే యువకుడు అనంత లోకాలకు వెళ్లిన సంఘటన నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలో చోటుచేసుకుంది. మిడుతూరు మండల పరిధిలోని 49 బన్నూరు గ్రామానికి చెందిన చందమాల రంగస్వామి,నాగమ్మ కుమారుడు చందమాల ఆటో శ్రీనివాసులు (45) అకస్మాత్తుగా గుండె పోటు రావడంతో శుక్రవారం తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో మరణించాడు.కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు వర్షం రావడంతో తమ పొలంలో గురువారం పొగాకు నారను సాయంత్రం దాకా నాటించాడు.ఆ తర్వాత రాత్రి కుటుంబ సభ్యులతో అందరితో పలకరించాడని రాత్రి కూడా బాగానే నిద్రపోయాడని తెల్లారేసరికి ఈ దురదృష్టకర సంఘటన జరగడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుము కున్నాయి.కుటుంబ యజమాని శ్రీనివాసులు ప్రతిరోజూ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు యజమాని మృతితో కుటుంబ సభ్యుల రోధనలు మిన్నంటాయి.మధ్యాహ్నం గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు.మృతునికి భార్య ఆనందమ్మ,పిల్లలు పల్లవి(17),గౌతమ్ (14) ఉన్నారు.కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

