NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఈద్గా భూమిని ఆన్లైన్ లో నమోదు చేయండి..

1 min read

సబ్ కలెక్టర్ ను కోరిన టిడిపి యువ నాయకులు

హొళగుంద న్యూస్ నేడు : హోళగుంద మండల కేంద్రంలోని మస్జిద్ – ఎ – అహలే సున్నతుల్  జమాత్ కు చెందిన ఈద్గా భూమిని ఆన్లైన్ నందు నమోదు చేసేందుకు చర్యలు తీసుకోవాలని టిడిపి యువ నాయకులు వలి బాషా,శాలి అమానుల్ల ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ను కోరారు. ఈ సందర్భంగా శుక్రవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చారు. టిడిపి యువ నాయకులు వలి బాషా,శాలి అమానుల్ల మాట్లాడుతూ దాదాపు గత 50 సంవత్సరాల నుండి మస్జిద్ – ఎ – అహలే సున్నతుల్  జమాత్ ముస్లిం సోదరులు మండల కేంద్రంలోని సర్వేనెంబర్ – 401, విస్తీర్ణం – 1.25 ఎకరాల భూమిలో ఈద్గా నిర్మించుకొని ప్రతి సంవత్సరం రంజాన్, బక్రీదు పర్వదినాలలో సామూహిక నమాజు ప్రార్ధనలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కావున సదరు భూమిని మస్జిద్ – ఎ – అహలే సున్నతుల్  జమాత్ కు చెందిన ఈద్గా గా ఆన్లైన్ నందు నమోదు చేసి పట్టా మంజూరు చేయాలని కోరారు. సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ స్పందిస్తూ విచారణ చేసి ఈద్గా భూమిని ఆన్లైన్ నందు నమోదు చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

About Author