చెన్నూరులో శ్రీ రామలింగ చౌడేశ్వరి దేవి 96వ దసరా మహోత్సవాలకు ఏర్పాట్లు
1 min read

చెన్నూరు న్యూస్ నేడు: మండల కేంద్రమైన చెన్నూరు పెన్నా నది సమీపంలో పరమట వీధిలో వెలసిన శ్రీ రామలింగ చౌడేశ్వరి దేవి 96వ దసరా మహోత్సవ లకు ఆలయ కమిటీ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. చెన్నూరులో చౌడేశ్వరి దేవి ఆలయం నిర్మించేందుకు దేవాంగ వంశస్థుడు శ్రీ శ్రీ శ్రీ గోమేథికం చంద్రమౌళి సిద్ధాంతి నెల్లూరు వాసి ముందుకొచ్చారు. చెన్నూరు కు చెందిన దేవాంగ వంశస్థులు కాళహస్తి మెరికలయ్య. గోదినా శివన్నారాయణ పలు వురుసహకారంతో 8-11-1929లో ఆలయాన్ని నిర్మించారు. అప్పటినుంచి ప్రతి సంవత్సరం దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రొద్దుటూరు తర్వాత దసరా ఉత్సవాలు నిర్వహించడంలో చెన్నూరు రెండో స్థానంలో నిలిచింది. దేవాంగ వంశస్థులు శ్రీ రామలింగ చౌడేశ్వరి దేవి ఆలయ కమిటీ గా ఏర్పడి దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. గత వారం రోజులుగా ఉత్సవాలు నిర్వహించేందుకు ఆలయ కమిటీ నిర్వాహకులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 22వ తేదీ నుంచి అక్టోబర్ 2,తేదీ వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.22న సోమవారం శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకారం.23న మంగళవారం శ్రీ శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి అలంకారం నిర్వహిస్తున్నారు.24న బుధవారం శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం.25న గురువారం శ్రీ గాయత్రీ దేవి అలంకారం.26న శుక్రవారం శ్రీ లలితా దేవి అలంకారం.27న శనివారం శ్రీ సంతాన లక్ష్మీదేవి అలంకారం.28న ఆదివారం శ్రీ భవానీ దేవి అలంకారం నిర్వహిస్తున్నారు.29న సోమవారం శ్రీ సరస్వతి దేవి అలంకారం.30న మంగళవారం శ్రీ మహిషాసుర మర్దిని అలంకారం 1న బుధవారం గజలక్ష్మి దేవి అలంకారం. 2న విజయదశమి పర్వదినం పురస్కరించుకొని శ్రీ విజయలక్ష్మి దేవి అలంకారం నిర్వహిస్తున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈనెల 27వ తేదీ సాయంత్రం ఏడు గంటలకు ఆర్కెస్ట్రా ఏర్పాటు చేశారు. 28 ఆదివారం శ్రీ భవానీ దేవి అలంకారం, కార్యక్రమంలో భాగంగా ఉదయం 9 గంటల నుంచి 8 9 10 తరగతిలో విద్యార్థులకు రాత అంశాలు ఫీజు పోటీలు మధ్యాహ్నం ఒంటిగంట నుండి సాయంత్రం 6 గంటల వరకు మౌలిక పోటీలు నిర్వహిస్తున్నారు. 28న ఆదివారం సాయంత్రం ,లోరిష బృందా నాట్య కళాధం ,వారిచే కూచిపూడి నృత్య ప్రదర్శన గురువు ,నున్న వీరలక్ష్మి ,గారిచే నిర్వహిస్తున్నారు. 29న సరస్వతి దేవి అలంకారం సోమవారం రోజున బిందె సేవా కార్యక్రమం అమ్మవారు నవదుర్గల అలంకారంతో చెన్నూరు శివాలయం నుంచి శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయం వరకు ఊరేగింపు కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో పుణ్యస్త్రీలు పాల్గొనాలని కమిటీ నిర్వాహకులు పిలుపునిచ్చారు. 30న రాత్రి 9 గంటల నుండి మహిషాసుర మర్దిని శక్తి వేషధారణలో నాట్యములు చేయుచు 12 గంటలకు అమ్మవారి ఎదురుగా మహిషాసుర సంహరణ దున్నపోతు నరకడం కార్యక్రమం ఉంటుంది. అనంతరంమహిషాసుర వధ(దిష్టిబొమ్మ దహనం) ఉంటుంది.విజయదశమిరోజున మధ్యహంశమీ దర్శనమునకుఏర్పటుచేశారు. రాత్రి గ్రామోత్సవం రోజున చెక్కభజన లు.కోలాటము. కడవబోనములు.గొడుగులు. ప్రభవలు.బాణాసంచపేలచడం.విధకార్యక్రమాలుఏర్పటుచేశారు.


