ఆక్వా చెరువులు రిజిస్ట్రేషన్ ప్రక్రియ నెలరోజుల్లోపుగానే పూర్తి చేయాలి
1 min read

ఆయా గ్రామాల్లో టాo టాo వేసి, రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించాలి
జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఏలూరు మండలం జాలిపూడి గ్రామంలో మంగళవారం ఆక్వా చెరువులను మత్స్యశాఖ అధికారులు,సంబంధిత రైతులతో కలిసి పరిశీలించి, పలువివరాలను అడిగి తెలుసుకుని,రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించి జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వాకల్చర్ అభివృద్ధి ఆధారిటీ ఆక్ట్ ను ననుసరించి జిల్లాలోని ఆక్వా చెరువుల వివరాలను నిర్దేశించిన సమయంలోగా ఆన్లైన్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు.ఆయా గ్రామాల్లో టాo టాo వేసి, రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించి, రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించినట్లయితే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అవుతుందన్నారు. రిజిస్ట్రేషన్ కు సర్వే, ఇతర వివరాలను స్థానిక తహాశీల్దారు కార్యాలయం నుండి జాబితా తీసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ, సచివాలయంలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. సచివాలయంలో మంచి కంప్యూటర్లు.జిల్లాలో 26 వేల 582 ఆక్వా చెరువులు ఉన్నాయని,వాటికి సంబంధించి చెరువు విస్తీర్ణం, యజమాని పేరు,ఆక్వా సాగు, వినియోగిస్తున్న ఎరువులు, తదితర వివరాలను విలేజ్ ఆక్వాకల్చర్ యాప్ లో ఇప్పటివరకు 20,900 పూర్తి అయ్యాయని, మిగిలినవి రెండు రోజుల్లో యాప్ లో పొందుపరచాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ డిడి బి.నర్సయ్య, తహశీల్దారు జి.విజయ కుమార్,మండల మత్స్యశాఖ అధికారి ఏ.సతీష్ కుమార్ చౌదరి,మండల సర్వేయర్లు, పిషరీష్ సహాయకులు, రెవిన్యూ సిబ్బంది,ఆక్వా రైతులు, తదితరులు పాల్గొన్నారు.

