NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

స్వస్థ నారీ సశక్త్ పరివార్  అభియాన్ని కలెక్టర్​ తనిఖీ

1 min read

మహిళలు ఆరోగ్య పరిరక్షణకు “స్వస్థ నారీ సశక్త్ పరివార్  అభియాన్” కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి

జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి

ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు  : ఏలూరు మండలం జాలిపూడి యంపి అప్పర్  ప్రైమరీ పాఠశాలలో మంగళవారం స్వస్థ నారీ సశక్త్ పరివార్  అభియాన్ సందర్భంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని, పిహెచ్సిని  జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి ఆకస్మిక తనిఖీలు చేశారు. ఉదయం 11:00 వరకు ఎంతమంది మహిళలు వైద్యపరీక్షలు,వైద్య సేవలు చేశారని అడగగా  70 మందికి వైద్య  పరీక్షలు నిర్వహించామని వైద్యాధికారులు జిల్లా కలెక్టరుకు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు  కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ తల్లి ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబంతో పాటు సమాజం ఆరోగ్యంగా ఉంటుందని అన్నారు. తల్లి అనారోగ్యంగా ఉంటే ఆ కుటుంబం ముందుకు పోయే పరిస్థితి ఉండదన్నారు. ఆరోగ్యవంత మైన స్త్రీ దేశానికి, రాష్ట్రానికి అవసరమని, వైద్యపరీక్షలు, సలహాలు ద్వారా ఆరోగ్యవంతమైన మహిళలుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వాలు సంకల్పించిందన్నారు.కిశోర బాలికలకు, మహిళలకు రక్తహీనత పరీక్షల నిర్వహణ, చికిత్సలు చేయడం, క్షయపరీక్ష, పిల్లల్లో సైకిల్ సెల్  గర్తించి వైద్య సేవలు అందించడం, గర్భిణీ ప్రసూతి పరీక్షలు, పిల్లలకు టీకా సౌకర్యం, గర్భవతుల పరీక్షలు నిర్వహణ పోషకాహరం ఆవశ్యకత గురించి వివరిస్తారని తెలిపారు. రక్తదాన శిబిరాలు నిర్వహణ, ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కార్డులు అందించడం ప్రత్యేక వైద్య శిబిరాలు ద్వారా సేవలను అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దారు జి.విజయకుమార్, వైద్యాధికారులు డా.ఆర్. ఫణీంద్ర కుమార్,డా.సి.హెచ్. పూర్ణ శ్రీనివాసు, ఉపాధ్యాయులు, ఏఎన్ఎంలు,వైద్య సిబ్బంది, విద్యార్థిని,విద్యార్థులు, ప్రజలు ఎక్కువ సంఖ్యలో హాజరయ్యారు.

About Author