NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వస్త్రాలయ వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం…

1 min read

వస్త్రాలయ వస్త్ర దుకాణాన్ని ప్రారంభించిన  సినీ నటి నిధి అగర్వాల్,  మాజీ రాజ్యసభ

సభ్యులు టిజీ వెంకటేష్ తో కలిసి ప్రారంభించిన ఎంపీ బస్తిపాటి నాగరాజు

పరిశ్రమల రాకతో జిల్లా అభివృధి చెందబోతుంది…ఎంపీ బస్తిపాటి నాగరాజు

కర్నూలు, న్యూస్​ నేడు:  కరువు, వలసలతో వెనుకబడిన కర్నూలు జిల్లా పరిశ్రమల రాక తో అభివృద్ధి చెందబోతుందని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు…కర్నూలు నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన వస్త్రాలయ వస్త్రాల దుకాణాన్ని సినీ నటి నిధి అగర్వాల్ మరియు మాజీ రాజ్యసభ సభ్యులు టిజీ వెంకటేష్ లతో కలిసి ఆయన ప్రారంభించారు…ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పత్తికొండ లోని జొన్నగిరి వద్ద త్వరలోనే రూ.200 కోట్లతో బంగారు వెలికితీత పరిశ్రమ రాబోతుందని, వీటి తో పాటు ఓర్వకల్లు వద్ద ఏర్పాటయ్యే డ్రోన్ల తయారీ పరిశ్రమ, సెమీకండక్టర్ పరిశ్రమలతో జిల్లా వాసులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు.

About Author